Home » సలార్ కలెక్షన్స్ పై నిర్మాత అలా చేశాడా..? నార్త్ ఇండియన్స్ ఏమంటున్నారంటే..?

సలార్ కలెక్షన్స్ పై నిర్మాత అలా చేశాడా..? నార్త్ ఇండియన్స్ ఏమంటున్నారంటే..?

by Anji
Ad

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్-టాప్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కిన సలార్ చిత్రం ప్రస్తుతం పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తోంది. సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ వంటి ఫ్లాప్ మూవీస్ తరువాత ప్రభాస్ కెరీర్ లో హిట్ గా నిలిచిన చిత్రం సలార్. సలార్ విడుదలకు ముందు  బాహుబలి రికార్డును సలార్ బ్రేక్ చేస్తుందా అనే వార్తలు వినిపించాయి. విడుదలైన తరువాత బాహుబలి రికార్డును సలార్ బ్రేక్ చేసేటట్టే కనిపించడం విశేషం. 

Advertisement

 క్రిస్మస్ కానుకగా ఈ సినిమా ఆడియెన్స్ ముందుకు వచ్చింది.దాదాపు ఆరేళ్ళ ఫ్యాన్స్ నిరీక్షణ తర్వాత ప్రభాస్ కు హిట్ అనేది పడింది.దీంతో ఫ్యాన్స్ హంగామా మాములుగా చేయడం లేదు.  ఇదిలా ఉంటే..  సలార్ సినిమాకి ఉన్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని అర్ధరాత్రి బెనిఫిట్ షోలు కూడా వేశారు. ఓవర్సీస్‌లోనూ ప్రీమియర్లకు అడ్వాన్స్ బుకింగ్‌లు భారీ స్థాయిలో జరిగాయి. ఇవన్నీ చూసి కచ్చితంగా ‘సలార్’ రికార్డు స్థాయిలో ఓపెనింగ్స్ సాధిస్తుందని చిత్ర యూనిట్‌తో పాటు సినీ విశ్లేషకులు, ప్రభాస్ అభిమానులు భావించారు. ఇంత వరకు బాగానే ఉంది. అయితే, సినిమాకు తొలిరోజు ప్రపంచ వ్యాప్తంగా రూ.180 కోట్ల గ్రాస్ వస్తుందని నిర్మాణ సంస్థ హోంబలే ఫిలింస్ భావించిందో ఏమో.. కానీ  అదే నంబర్‌ను ఈరోజు పేపర్‌లో ప్రకటన కింద వేసేసింది.

వాస్తవానికి ప్రభాస్ సలార్ 178.7 కోట్లు వసూలు చేసింది. కానీ  ప్రముఖ హిందీ దినపత్రిక దైనిక్ భాస్కర్‌తో పాటు మరికొన్ని హిందీ దినపత్రిల్లో మొదటి పేజీలో ‘సలార్’ ప్రకటన వచ్చింది. ఒక పోస్టర్‌ను ప్రకటన కింద వేశారు. ఈ పోస్టర్‌పై తొలిరోజు వరల్డ్ వైడ్ గ్రాస్ రూ.180 కోట్లు అని వేశారు. రికార్డ్ బ్రేకింగ్ బ్లాక్ బస్టర్ అని రాశారు. ఈ ప్రకటన చూసిన నార్త్‌లోని షారుఖ్ ఖాన్ అభిమానులు ఇప్పుడు ప్రభాస్ పరువు తీస్తున్నారు. సలార్ లెక్క అంతా దొంగ లెక్క అని విమర్శిస్తున్నారు.  నిన్న అర్ధరాత్రికే నిర్మాత ఈ ప్రకటన ఇచ్చేశారు. మరి అప్పటికి ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్ ఎలా తెలిసిపోయిందనేది నార్త్ ఆడియన్స్ ప్రశ్న. నిజమే.. అలా అడగడంలో తప్పులేదు. నిర్మాతకు ఎందుకంత ఆత్రం? పేపర్‌లో తొలిరోజు కలెక్షన్ గురించి ప్రకటన ఇవ్వాల్సినంత అవసరం ఏముంది అనేది కొంత మంది విశ్లేషకుల ప్రశ్నిస్తున్నారు. పాజిటివ్ టాక్ ఉన్నది నెగిటివ్ చేసుకుంటున్నారని మరికొందరూ విమర్శలు చేస్తున్నారు.  అయితే రెండు రోజులకు కలిపి సలార్ 295.7 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.

Advertisement

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading