టీమిండియా మహిళల జట్టు క్రికెట్ టీం కెప్టెన్ హార్మన్ ప్రీత్ కౌర్ పై ఐసీసీ చర్యలు తీసుకున్న సంగతి మనందరికీ తెలిసిందే. మొన్న బంగ్లాదేశ్ తో జరిగిన మూడో వన్డే మ్యాచ్లో అంపైర్ నిర్ణయాన్ని తప్పుపడుతూ… తీవ్ర అసహనం వ్యక్తం చేసింది టీమిండియా కెప్టెన్ హార్మన్ ప్రీత్ కౌర్. ఎల్ బి డబ్ల్యు విషయంలో అంపైర్ తప్పుడు నిర్ణయం తీసుకున్నాడని… గ్రౌండ్ లో ఉన్న వికెట్లను బ్యాట్ తో కొట్టింది టీం ఇండియా కెప్టెన్ హార్మన్ ప్రీత్ కౌర్.
Advertisement
మ్యాచ్ అనంతరం కూడా…. ఆ అంపైర్ ను పచ్చి బూతులు తిట్టింది హర్మన్ ప్రీత్ కౌర్. దీంతో టీమిండియా కెప్టెన్ పై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ కఠిన చర్యలు తీసుకుంది. ఏకంగా రెండు మ్యాచ్లు ఆడకుండా కౌరు పై నిషేధం విధించింది అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్. ఇక ఇదే అంశంపై సీనియర్ క్రికెటర్లు అలాగే మాజీలు… టీమిండియా కెప్టెన్ కౌర్ పై సీరియస్ అవుతున్నారు. ఇందులో భాగంగానే పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ ఆఫ్రిది సంచలన వ్యాఖ్యలు చేశాడు.
Advertisement
అవుట్ అయిన విషయంలో కౌర్ అంతలా రియాక్ట్ అవ్వాల్సిన పనేలేదని… చాలా ఓవర్ చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశాడు. తప్పుడు నిర్ణయాలు జరగడం చాలా కామన్… కానీ క్రికెటర్లు ఇలా అసహనాన్ని ప్రదర్శించకూడదు అని వెల్లడించారు. కొంచమైనా బాధ్యతయుతంగా వ్యవహరించాలని చురకలం అంటించారు ఆఫ్రిది. అయితే ఆఫ్రిది చేసిన వ్యాఖ్యలపై టీమిండియా ఫ్యాన్స్ సీరియస్ అవుతున్నారు. మొదట మీ పాకిస్తాన్ జట్టు గురించి ఆలోచించండి అంటూ ఓ రేంజ్ లో రెచ్చిపోతున్నారు.
ఇవి కూడా చదవండి
అంతా తొండాటే…. పేరుకే పాకిస్తాన్ యువ జట్టు… అందరూ అంకుల్సే ?
7G బృందావన కాలనీ.. హీరోయిన్ ఇప్పుడెలా ఉందో తెలుసా?
గ్రాండ్ గా SRH కెప్టెన్ ఎయిడెన్ మార్క్రమ్ పెళ్లి…ఫోటోలు వైరల్