ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ అంటే ప్రజలు చాల ఉత్కంఠంగా చూస్తారు అనేది అందరికి తెలిసిందే . కానీ రెండు దేశాల తరపున ఆడే ఆటగాళ్లు మాత్రం మేము ప్రజలు చూసే విధంగా ఈ మ్యాచ్ ను చూడం అని కామెంట్స్ చేస్తూ ఉంటారు. ఇక వారు దానిని చుపిండానికి.. నిరూపించడానికి కూడా కొన్ని పనులు ఆ విధంగా చేస్తారు. అయితే ఎల్లుండి ఇండియా, పాకిస్థాన్ మధ్య ఆయుష్య కప్ లో భాగంగా మ్యాచ్ జరగనుంది.
Advertisement
అయితే ఈ మ్యాచ్ కోసం రెండు దేశాల ఆటగాళ్లు ప్రాక్టీస్ ను కూడా ముమ్మరం చేసారు. కానీ పాక్ జట్టుకు చెందిన షాహిన్ షా ఆఫ్రిది మోకాలి గాయం కారణంగా జట్టులో లేడు అనే విషయం తెలిసిందే. కానీ అతను వైద్యుల పరివేక్షణ కోసం పాక్ జట్టుతో యూఏఈకి వెళ్ళాడు. అక్కడ అందరూ ప్రాక్టీస్ చేస్తుంటే.. అతను మాత్రం ఓ మూలాన కూర్చున్నాడు. ఇక అతడిని చూసిన మన భారత ఆటగాళ్లు అందరూ పరామర్శించడం అనేది ప్రారంభించారు.
Advertisement
మొదట స్పిన్నర్ చాహల్ వెళ్లి గాయం గురించి ఆరా తీయగా.. ఆ తర్వాత టీం ఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ వెళ్ళాడు. ఆఫ్రిదిని గాయం గురించి అడిగి తెలుసుకున్నాడు. అప్పుడు తనకు శ్రీలంక పర్యటనలో ఈ గాయం అయ్యినట్లు ఆఫ్రిది తెలపగా.. నువ్వు తొందరగా కోలుకోవాలని చెప్పాడు. ఇక ఆఫ్రిది కూడా కోహ్లీని నువ్వు తొందరగా ఫామ్ లోకి రావాలని నేను ప్రార్ధిస్తున్నాను అని చెప్పాడు. ఇక ప్రస్తుతం వీరు కలిసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఇవి కూడా చదవండి :