సాధారణంగా ప్రయివేటు కంపెనీలు తమ ప్రోడక్ట్ ని ప్రమోట్ చేసుకోవడం కోసం.. సెలబ్రిటీలను అంబాసిటర్ గా నియమించుకుంటారు. అందుకు వారికి కొంత అమౌంట్ కూడా ఇస్తుంటారు. హీరోలపై పెట్టుబడి పెట్టేంత స్థోమత లేని వారు మాత్రం.. దొంగ చాటుగా హీరోల పేర్లను ఫోటోలను, సినిమా పోస్టర్లను వాడుకుంటారు. ఇక వీటి ద్వారా జనాలను ఆకర్షించి డబ్బు సొమ్ము చేసుకుంటారు. రజనీకాంత్ విషయంలో కూడా ఇలా జరుగుతుండడంతో పైరయ్యారు. ప్రధానంగా తన న్యాయవాద చేత ఓ సీరియస్ వార్నింగ్ ఇప్పించారు.
Advertisement
రజనీకాంత్ పేరు, ఫోటో, మాటలు ఆయనకు సంబంధించిన ఏ ప్రత్యేకతలైనా వినియోగించినట్టయితే.. వ్యక్తిత్వము సెలబ్రిటీ హక్కులను ఉల్లంఘించిన అవుతుందన్నారు. అలా చేసినట్లయితే చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటామని రజనీకాంత్ తరపు న్యాయవాది ఎలం భారతి ఓ పబ్లిక్ నోటీస్ కూడా విడుదల చేశారు. సూపర్ స్టార్ రజనీకాంత్ ఒక సెలబ్రిటీ హోదాలో ఉన్న వ్యక్తి కావడంతో.. వాణిజ్యపరంగా రజనీకాంత్ వ్యక్తిత్వము పేరు మాటలు ఫోటోలను ఉపయోగించే హక్కులపై కేవలం ఆయనకు మాత్రమే నియంత్రణ ఉంటుంది.
Advertisement
కొన్ని వేదికలు, మాధ్యమాలు, ఉత్పత్తుల తయారీ దారులు మాత్రం రజనీకాంత్ అనుమతి లేకుండానే.. పేరు, మాటలు, ఫోటోగ్రాఫ్, వ్యంగ్య చిత్రాలు నటనకి సంబంధించి పోస్టర్లను దుర్వినియోగం చేస్తున్నారు. దీని ద్వారా వాళ్లు వినియోగదారులను ఆకర్షించి.. తమ ఉత్పత్తులను కొనుగోలు చేసే విధంగా లేదా.. తమ ప్లాట్ఫాములకు వచ్చే విధంగా చర్యలకు పాల్పడుతున్నాయి. రజనీకాంత్ ఒక గొప్ప నటుడు తో పాటు మానవతావాది కావడంతో.. ప్రపంచవ్యాప్తంగా ఆయనను లక్షలాదిమంది సూపర్ స్టార్ గా పిలుస్తున్నారు. చలనచిత్ర పరిశ్రమలో రజనీకాంత్ కు ఉన్న గౌరవము అభిమానుల సంఖ్య సాటిలేనిది. అతనికి ఉన్న ప్రతిష్ట లేదా వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తే.. రజనీకాంత్ కు ఎంతో నష్టం అని నోటీసులో న్యాయవాది ఎలం భారతి పేర్కొన్నారు.