ప్రస్తుతం వెబ్ సిరీస్‌ల హవా నడుస్తోంది. ఓటీటీ సంస్థలే వీటిని స్ట్రీమింగ్ చేయడానికి అధిక ఆసక్తిని కనబరుస్తున్నాయి. పెట్టుబడికి ముప్పులేకపోవడంతో దర్శక, నిర్మాతలు వెబ్ సిరీస్‌లను రూపొందించడానికి సిద్ధమవుతున్నారు. తాజాగా రూపొందించిన వెబ్ సిరీస్ పేపర్ రాకెట్. ఇది జీ ఛానల్ ఒరిజినల్ వెబ్ సిరీస్. శ్రీనిధి సాగర్ నిర్మించిన దీనికి కృత్తిక ఉదయనిధి దర్శకత్వం వహించారు. కాళిదాస్ జయరామ్ తాన్య రవిచంద్రన్ జంటగా నటించిన ఇందులో గౌరి జి.కిషన్, నాగివీడు తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. ఇక ఈ వెబ్ సిరీస్ ఈ నెల 29 నుంచి జీ చానల్ లో స్ట్రీమింగ్ కానుంది.
Advertisement
ఈవెబ్ సిరీస్ ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని స్థానిక రాయపేటలోని సత్యం థియేటర్ లో నిర్వహించారు. ఉదయనిధి స్టాలిన్, శింబు, విజయ్ ఆంటోని దర్శకుడు మిష్కిన్, మారి సెల్వరాజ్ పాల్గొన్నారు. ఈ వేదికపై దర్శకురాలు కృతిక మాట్లాడారు. తనను ప్రోత్సహిస్తున్న తన కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా నటుడు శింబుతో చిత్రం చేయాలన్నది తన కోరిక అని, ఈ ఆరంభంలో జరుగుతుందని భావిస్తున్నానని అన్నారు. శింబు తొలిసారి హీరోగా నటిస్తున్నప్పుడు తనకు ఇంకా పెళ్లి కాలేదు అని ఒక యాడ్ ఏజెన్సీని నిర్వహిస్తున్నారని తెలిపారు. సాధారణంగా రకరకాల విమర్శలు చేస్తుంటారని అదేవిధంగా తొలి చిత్రం సమయంలో శింబుపై కూడా ఇతను హీరోనా అని విమర్శలు వచ్చాయి అని అన్నారు.
Advertisement
ఆయన నటిస్తున్న తొలిచిత్రం స్టిల్స్ బయటికి వచ్చినప్పుడు ఆ చిత్ర యూనిట్‌లో ఉన్నత స్థాయికి ఎదిగేది శింబునే అని తాను భావించాను అన్నారు. ఉదయనిధి గురించి చెప్పాలంటే తాను సినిమా ఇండస్ట్రీలోకి వెళ్తున్నానని చెప్పగానే ఆయన చాలా ఆలోచించారన్నారు. ఆ తరువాత తాను ఇంట్లో చేసే గోల పడడం కంటే సినిమా రంగంలోకి వెళ్లడం మంచిదని.. తనకు ప్రశాంతంగా ఉంటుందని భావించారేమో అని సమ్మతించారన్నారు. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన తనకు పూర్తి సహకారాన్ని అందిస్తున్నారని పేర్కొన్నారు. అదేవిధంగా తమిళనాడులోనే కాకుండా దేశవ్యాప్తంగా మహిళలకు సపోర్టు అందిస్తే ఉన్నత స్థాయికి ఎదుగుతారని కృతిక ఉదయనిధి పేర్కొన్నారు.
Also Read :
“ఊ అంటావా” సాంగ్ వారి లోపాలను బయటపెట్టేందుకు చేశానంటున్న సమంత..!!
ఎన్టీఆర్ పెద్దకుమారుడు రామకృష్ణ చిన్న వయసులో ఎలా మరణించాడు…? ఆయన గురించి ఎవ్వరికీ తెలియని నిజాలు….!