Home » ఎన్టీఆర్ పెద్దకుమారుడు రామకృష్ణ చిన్న వయసులో ఎలా మరణించాడు…? ఆయన గురించి ఎవ్వరికీ తెలియని నిజాలు….!

ఎన్టీఆర్ పెద్దకుమారుడు రామకృష్ణ చిన్న వయసులో ఎలా మరణించాడు…? ఆయన గురించి ఎవ్వరికీ తెలియని నిజాలు….!

by AJAY
Ad

అన్నగారు, ఎన్టీ రామారావు తన 20వ ఏట మేనమామ అయినటువంటి కాట్రగడ్డ చెంచయ్య కుమార్తె బసవతారకం గారిని వివాహం చేసుకున్నారు. 1942 మే 2న ఎన్టీఆర్ బసవతారకం గారితో అన్నగారి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఎన్టీఆర్ బసవతారకం దంపతులకు మొత్తం ఎనిమిది మంది మగ సంతానం కాగా… నలుగురు ఆడపిల్లలు జన్మించారు. ఎన్టీఆర్ తన కుమారులకు రామకృష్ణ, జై కృష్ణ, సాయి కృష్ణ, బాలకృష్ణ, హరికృష్ణ, మోహనకృష్ణ, జయశంకర్ కృష్ణ అని అందరి పేరు చివరన కృష్ణ వచ్చే విధంగా నామకరణం చేశారు.

Advertisement

అంతేకాకుండా కుమార్తెలకు పురందేశ్వరి, లోకేశ్వరి, భువనేశ్వరి, ఉమామహేశ్వరి అని అందరి పేరు చివరన ఈశ్వరి అనే పదం వచ్చేలా నామకరణం చేశారు. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ పెద్ద కుమారుడు రామకృష్ణ గురించి చాలామందికి తెలియదు. రామకృష్ణ అంటే ఎన్టీఆర్ కు ఎంతో ప్రేమ అభిమానం ఉండేవి, చెన్నైలోని ఎన్టీఆర్ నివాసంలో రామకృష్ణ అతిథులను ఎంతో గౌరవంగా చూసుకునే వారట. వచ్చిన ప్రతి ఒక్కరికి మర్యాద ఇచ్చేవారట.

Advertisement

చూడ్డానికి రామకృష్ణ అచ్చం ఎన్టీ రామారావు మాదిరిగా అందంగా ఎత్తుగా ఉండేవారు. ఇక రామకృష్ణ తన బాబాయ్ త్రివిక్రమ్ రావు వద్ద వ్యాపారంలో మెలుకువలు నేర్చుకున్నారు. తండ్రి ఎన్టీఆర్ మాదిరిగానే రామకృష్ణకు అపారమైన భక్తి ఉండేది. దాంతో చిన్న వయసులోనే దాదాపు దేశం లోని పుణ్యక్షేత్రాలు అన్ని రామకృష్ణ చూసి వచ్చారు. ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా కనిపించే రామకృష్ణ కేవలం 17 ఏళ్ల వయసులోనే అనారోగ్యంతో మరణించారు.

రామకృష్ణ నానమ్మ తాతయ్యలతో కలిసి నిమ్మకూరు వెళ్ళాడు. అక్కడే రామకృష్ణ మసూచి వ్యాధి బారిన పడ్డారు. రామకృష్ణ చనిపోయిన రోజు ఎన్టీఆర్ ఇరుగుపొరుగు అనే సినిమా షూటింగ్ లో ఉన్నారు. షూటింగ్ పూర్తి అయిన తర్వాత ఎన్టీఆర్ మేకప్ గదిలోకి వెళ్లి మేకప్ తీసేసిన తర్వాత బోరున ఏడ్చేసారట. ఆయనను ఓదార్చడం ఎవరివల్ల కాలేదని చెబుతుంటారు. విషయం తెలిసిన వెంటనే ఎన్టీఆర్ తన కుటుంబంతో కలిసి నిమ్మకూరుకు బయలుదేరి అక్కడే రామకృష్ణ అంత్యక్రియలను నిర్వహించారు.

Visitors Are Also Reading