స్వర్గీయ నందమూరి తారకరామారావు గురించి తెలియని వారు ఎవ్వరూ ఉండరు. ఆయన సినీ ఇండస్ట్రీలోనైనా, రాజకీయంలోనైనా మంచి పేరునే సంపాదించుకున్నారు. ముఖ్యంగా సినిమాల విషయానికొస్తే.. సాంఘిక, జానపద, పౌరాణిక వంటి ఇలా ఎన్నో చిత్రాల్లో అద్భుతమైన నటన కనబరిచి ప్రేక్షకులను మెప్పించిన ఘనత ఎన్టీఆర్కే దక్కిందని చెప్పవచ్చు. ఇక సినిమా ఇండస్ట్రీలో ప్రేమ వ్యవహారాలు అనేవి సర్వసాధారణమనే చెప్పాలి. ఎన్టీఆర్-ఏఎన్నార్‌ల కాలం నుంచి ప్రేమ వ్యవహరాలు కొనసాగాయి.
ఇది కూడా చదవండి : పెళ్లికి ముందున్న ప్రేమ ఆ తరవాత ఎందుకు ఉండదు…5 కారణాలు ఇవేనా..?
Advertisement
ఈ నేపథ్యంలోనే గతంలో లవ్ ట్రాక్ నడిపిన వారిలో సీనియర్ ఎన్టీఆర్ ఉన్నారనే విషయం ఇటీవల ఓ సంచలనంగా మారింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నటి షావుకారు జానకి ఎన్టీఆర్ ఓ స్టార్ హీరోయిన్‌తో ప్రేమలో ఉన్నారనే విషయంపై క్లారిటీ ఇచ్చింది. ఇదిలా ఉండగా.. ఎన్టీఆర్-కృష్ణకుమారిల మధ్య వ్యవహారం కంటే ముందే ఆయనకు బసవతారకంతో పెళ్లి జరిగింది. వారికి అప్పటికే 8 మంది కొడుకులు, నలుగురు కూతుర్లు కలరు. అదే సమయంలోనే ఎన్టీఆర్ కృష్ణకుమారితో కలిసి ఎక్కువ సినిమాల్లో నటించారు. ఆ సమయంలో వారిద్దరి మధ్య ప్రేమ చిగురించి పెళ్లి కూడా చేసుకున్నారట. ఈ విషయంపై కృష్ణకుమారి సోదరి షావుకారు జానకి స్పందించారు.
Advertisement
ఇది కూడా చదవండి : అమల చెప్పిన ఆ మాటలు విని కన్నీరు పెట్టుకున్న అక్కినేని నాగేశ్వరరావు.. అందుకోసమేనా..?
షావుకారు జానకి ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. అప్పటికే వివాహం జరిగిన ఎన్టీఆర్ నా చెల్లెలుని పెళ్లి చేసుకోవడం అంత శ్రేయస్కరంగా ఉండేది కాదేమో.. వారి మధ్య ఏం జరిగిందో మాత్రం తెలియదు. వారు గొడవ పడ్డారా లేక విడిపోయారో తెలియదు. కానీ కెరీర్ పీక్స్‌లో ఉన్న సమయంలో కృష్ణకుమారి ఒక ఫోన్ కాల్‌తో 17 సినిమాలను రద్దు చేసుకుంది. ఆ తరువాత ఓ సీనియర్ జర్నలిస్ట్ అజయ్ మోహన్ కైఠాన్ని పెళ్లి చేసుకుంది. అప్పుడు కూడా ఓ బడా నిర్మాత నాకు ఫోన్ చేసి కైఠాన్ తో మీ చెల్లి ఆపండని చెప్పారు. కానీ నేను ఆ పని మాత్రం చేయనని చెప్పినట్టు అప్పటి విషయాలను గుర్తు చేసింది షావుకారి జానకి.
ఇది కూడా చదవండి : తక్కువ బడ్జెట్ తో తెరకెక్కి భారీ వసూళ్లు రాబట్టిన 10 టాలీవుడ్ చిత్రాలు ఇవే…!