దేశంలో కరోనా కలకలం రేగుతోంది. త్వరలోనే థర్డ్ వేవ్ రాబోతుంది అనే సంకేతాలు కనిపిస్తున్నాయి. దాంతో వైద్య నిపుణులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. సాధారణ ప్రజలతో పాటు సెలబ్రిటీలు, ప్రజాప్రతినిధులు సైతం కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే పలువురు సినీ రాజకీయ ప్రముఖులు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. తాజాగా మరో సెలబ్రిటీ కూడా కరోనా బారిన పడ్డారు. సీనియర్ హీరోయిన్ శోభన తనకు కరోనా పాజిటివ్ వచ్చినట్టు పేర్కొన్నారు.
Advertisement
ఇన్స్టాగ్రామ్ లో నటి ఈ విషయాన్ని అభిమానులతో తెలిపారు. తను అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఒమిక్రాన్ బారిన పడ్డానని పేర్కొన్నారు. ప్రపంచమంతా నిద్రపోతున్న వేళ తీవ్ర అనారోగ్య లక్షణాలతో ఇబ్బంది పడినట్టు శోభన తెలిపారు కీళ్లనొప్పులు, చలి, గొంతునొప్పి తనను ఇబ్బంది పెట్టాయని శోభన చెప్పారు. కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకోవడం వల్ల తాను భయపడట్లేదని అన్నారు.
Advertisement
అయినా తన జాగ్రత్తలో తను ఉన్నట్టు చెప్పారు. అంతేకాకుండా డాక్టర్ సలహా మేరకు టాబ్లెట్లు వాడుతున్నట్టు తెలిపారు. ఇది ఇలా ఉండగా ఇప్పటి వరకు టాలీవుడ్, కోలీవుడ్ లో పలువురు తారలు కరోనా బారినపడ్డారు. ఇక ప్రస్తుతం కరోనా తో పోరాడుతున్న వారిలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, సంగీత దర్శకుడు తమన్, హీరో మంచు విష్ణు, మంచు లక్ష్మి, నటుడు రాజేంద్రప్రసాద్, నటుడు సత్యరాజ్, హీరోయిన్ త్రిష సహా పలువురు ఉన్నారు.