Ad
భారత జట్టును పరిమిత ఓవర్లలో నడిపేంచే పేసర్లు అంటే ముందు వినిపించే పేరు బుమ్రా, భువనేశ్వర్ కుమార్. ఈ ఇద్దరు తమ బౌలింగ్ తో ఎన్నో మ్యాచ్ లలో గెలిపించారు. కానీ తాజాగా జరిగిన ఆసియా కప్ లో బుమ్రా లేని లోటు కనిపించింది. ఈ టోర్నీలో భువీ రాణించిన అతనికి ఎవరు తోడు లేకపోవడంతో భారతజట్టు కనీసం ఫైనల్స్ కు కూడా వెళ్లకుండానే వెన్నకి వచ్చేసింది.
అయితే ఈ మధ్యే వెళ్లిన ఇంగ్లాండ్ పర్యటనలో బుమ్రా గాయపడిన విషయం తెలిసిందే. కానీ అతను ఇంకా కోలుకోలేదు అని తెలుస్తుంది. అప్పటి నుండి ఇప్పటివరకు నేషనల్ క్రికెట్ అకాడమీలోనే ఉంటున్నాడు బుమ్రా. ఈ ఆసియా కప్ కు మిస్ అయిన బుమ్రా వచ్చే నెలలో ప్రారంభం కానున్న ప్రపంచ కప్ కు కూడా మిస్ కానున్నట్లు తెలుస్తుంది. అయితే తాజాగా బుమ్రాకు ఫిట్ నెస్ టెస్ట్ అనేది నిర్వహించారు.
ఈ టెస్ట్ లో వచ్చే ఫలితం ఆధారంగానే బుమ్రా ప్రపంచ కప్ జట్టులోకి వస్తాడా లేదా అనేది తేలిపోనుంది. అయితే ఐసీసీ ప్రపంచ కప్ జట్టును ప్రకటించడానికి ఈ నెల 16 వరకు సమయం ఇచ్చింది. కాబట్టి అప్పటివరకు బుమ్రా ఫిట్ నెస్ పైన ఫోకస్ చేసి.. అదే ఆఖరి రోజున ప్రపంచ కప్ జట్టును బీసీసీఐ ప్రకటించనున్నట్లు తెలుస్తుంది. కానీ నదుల్లో బుమ్రా ఉంటాడా.. లేదా అనేది అతని ఫిట్ నెస్ పైనే ఆధారపడి ఉంది.
ఇవి కూడా చదవండి :
పాపం బాబర్.. కెప్టెన్ అని మరిచిపోయిన అంపైర్..!
నా కంటే కోహ్లీనే గొప్ప అని ఒప్పుకున్నా దాదా..!
Advertisement