Home » కోహ్లీ కెప్టెన్ అయితే ఆర్సీబీ పని గోవిందా.. గోవిందా..?

కోహ్లీ కెప్టెన్ అయితే ఆర్సీబీ పని గోవిందా.. గోవిందా..?

by Azhar
Ad
ఐపీఎల్ 2021 లో రాయల్ ఛాలెంజర్స్ ను బెంగళూర్ చేర్చిన కెప్టెన్ విరాట్ కోహ్లీ.. ఈ ఏడాది ఆ బాధ్యతల నుండి తప్పుకున్నాడు. దాంతో ఆ జట్టు వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు అయిన ఫఫ్ డుప్లెసిస్ ను తీసుకొని తన కెప్టెన్ గా నియమించుకుంది. ఇక కొత్త నాయకుడితె ఇప్పటివరకు టైటిల్ గెలవని బెంగళూర్ జట్టు… ఈ ఏడాదైనా ఆ కలను నెరవేర్చుకోవాలని అని బరిలోకి వచ్చింది. అందుకు తగ్గట్లుగానే మొదట్లో అద్భుతమైన ప్రదర్శనలు చేసిన ఆర్సీబీ ఇప్పుడు ప్లే ఆఫ్స్ కు వచ్చింది.
అయితే బెంగళూర్ జట్టు ప్లే ఆఫ్స్ కు చేరడం పై తాజాగా భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కీలక వ్యాఖ్యలు చేసాడు. ఈ సీజన్ లో కూడా ఆర్సీబీ కెప్టెన్ గా విరాట్ కోహ్లీ ఉంటె ఆ జట్టు ఇంత వరకు వచ్చేది కాదు అని చెప్పాడు. ఎందుకంటే.. కోహ్లీ కెప్టెన్ అయితే.. అతను ఏ ఆటగాడు అయిన రెండు మ్యాచ్ లలో విఫలమైతే చాలు జట్టు నుండి పక్కన బెడుతాడు. దాంతో సరైన జట్టును నిర్మించలేడు. మనం ఇన్ని సీజన్లలో అదే చూసాం.
కానీ ఈ ఏడాది మాత్రం అలా జరగలేదు. కొత్త కెప్టె డుప్లెసిస్ అలాగే హెడ్‌కోచ్‌ సంజయ్‌ బంగర్‌ ఆటగాళ్లను సమయాన్ని.. అవకాశాని ఇచ్చారు. వారు జట్టులో పెద్ద మార్పులు చేయలేదు. అందుకే ఆర్సీబీ ఇంతవరకు వచ్చింది. ఒకవేళ కోహ్లీ లాగే ఈ ఏడాది కూడా ఆటగాడు రెండు మ్యాచ్ లలో రాణించకపోతే తీసేయాల్సి వస్తే ముందు కోహ్లీనే తీసేయాలి. కానీ వారు అలా చేయలేదు. ఫామ్ లేదని ఏ ఆటగాడిని కూడా వారు బయటకి పంపలేదు. అందుకే జట్టు కుదురుకుని ప్లే ఆఫ్స్ కు వచ్చింది. అయితే బెంగళూర్ రేపు లక్నోతో ఎలిమినేటర్ మ్యాచ్ ఆడుతుంది. ఇందులో గెలిచిన జట్టు టైటిల్ పోరులో ముందుకు వెళ్లగా ఓడిన జట్టు ఇంటికి వెళ్తుంది.

Advertisement

Visitors Are Also Reading