టీమిండియా మాజీ కెప్టెన్ మరియు ప్రస్తుత చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సారథి మహేంద్ర సింగ్ ధోని గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. తన కెరీర్ ప్రారంభం నుంచి అంటే దాదాపు 2007 సంవత్సరం నుంచి టీమిండియా కు అనేక ఐసీసీ టోర్నమెంట్లను అందించాడు మహేంద్రసింగ్ ధోని. ఇందులో 2007 t20 ప్రపంచ కప్, 2011 వన్డే వరల్డ్ కప్ అలాగే 2013 ఛాంపియన్ ట్రోఫీ కూడా ఉన్నాయి. ఈ మూడు కప్పులను టీమిండియా కు అందించిన ఏకైక క్రికెటర్ గా ధోని రికార్డు లోకి ఎక్కాడు.
Advertisement
ఇక నిన్న ఐసీసీ… 2023 వన్డే వరల్డ్ కప్ షెడ్యూల్ ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 5వ తేదీ నుంచి దాదాపు 46 రోజులు అంటే నవంబర్ 19వ తేదీ వరకు 2023 వన్డే వరల్డ్ కప్ జరగనుంది. ఈ తరుణంలో టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ మహేందర్ సింగ్ ధోని పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీమిండియా జట్టులో సచిన్ టెండూల్కర్ తో పాటు హర్భజన్ సింగ్ అలాగే మహేందర్ సింగ్ ధోని ఇలా చాలామందికి సెంటిమెంట్లు ఉన్నాయని వీరేంద్ర సెహ్వాగ్ తెలిపారు.
Advertisement
జటులో ప్రతి ఒక్కరికి ఒక సెంటిమెంటు ఉంటుందని కూడా వివరించారు. అయితే మహేంద్రసింగ్ ధోని కి కూడా ఒక సెంటిమెంట్ ఉందని తెలిపారు. 2011 వన్డే ప్రపంచ కప్ సమయంలో… మహేంద్ర సింగ్ ధోనీ… ప్రతిరోజు కిచిడీ తినేవాడని వీరేంద్ర సెహ్వాగ్ వివరించారు. అలా ఎందుకు తిన్నావ్ అని అడుగుతే… తనకు కిచిడి సెంటిమెంట్ అని ధోని చెప్పినట్లు వివరించారు. నేను పరుగులు చేయకపోయినా ఆ కిచిడీ తినడం వల్ల టీమిండియా గెలుస్తుందని మహేంద్ర సింగ్ ధోని చెప్పినట్లు… అదే తన సెంటిమెంట్ అని చెప్పాడట. ఈ విషయాన్ని తాజాగా వీరేంద్ర సెహ్వాగ్ ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.
ఇవి కూడా చదవండి
Sanju Samson : అయ్యర్ ఔట్.. 7 నెలల తర్వాత శాంసన్ రీఎంట్రీ..ఇకపై వరుసగా ఛాన్స్‌లే..?
వరల్డ్ కప్ కోసం BCCI ధోనితో కలిసి ఇలాంటి ప్లాన్ వేసిందా ? మాములుగా లేదుగా !
Ms Dhoni : బస్సు డ్రైవర్ గా మారిన ధోనీ సహచరుడు