Home » పంత్ అనవసరంగా ఆ పని చేసాడు అంటున్న సెహ్వాగ్…!

పంత్ అనవసరంగా ఆ పని చేసాడు అంటున్న సెహ్వాగ్…!

by Azhar
Ad

భారత జట్టు యొక్క గొప్ప ఓపెనర్లలో మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ పేరు ముందు వరుసలో ఉంటుంది. టీం ఇండియాకు గంభీర్, సచిన్, గంగూలీ ఇలా చాలా మంది ఆటగాళ్లతో ఓపెనింగ్ చేసిన సెహ్వాగ్ గురించి.. ఆయన రికార్డుల గురించి అందరికి తెలుసు. ప్రతి బంతిని బౌండరీకి పంపాలి అనే ఒక్కే ఉద్దేశ్యంతో బ్యాటింగ్ చేసే సెహ్వాగ్.. ఇప్పుడు రిషబ్ పంత్ చేసిన ఓ పనిని తప్పు బడుతున్నాడు. అయితే టీం ఇండియా యొక్క ఇంగ్లాండ్ టూర్ లోని మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నిన్న ఆఖరి వన్డే మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో రిషబ్ పంత్ బ్యాటింగ్ అద్భుతం.

Advertisement

టీం ఇండియా టాప్ ఆర్డర్ మొత్తం కుప్పకూలిన తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన పంత్, పాండ్య కలిసి మళ్ళీ ఇన్నింగ్స్ అనేది చక్కబెట్టారు. ఆ తర్వాత పాండ్య ఔట్ అయిన కూడా పంత్ చెలరేగాడు. ఈ క్రమంలోనే సెంచరీ అనేది చేసుకున్న పంత్.. 42వ ఓవర్ డేవిడ్ విల్లే బౌలింగ్ లో మొదటి ఐదు బంతులను వరుసగా బౌండరీకి పంపించాడు. ఆ తర్వాత చివరి బంతికి సింగిల్ తీసిన పంత్.. మళ్ళీ స్ట్రైక్ లోకి వచ్చి.. మొదటి బంతికే బౌండరీ బాది టీం ఇండియాను గెలిపించాడు. కానీ ఇప్పుడు ఇదే విషయంలో సెహ్వాగ్ మాట్లాడుతూ.. పంత్ స్థానంలో నేను ఉంటె సిక్స్ కొట్టేవాడిని అని కామెంట్స్ చేసాడు.

Advertisement

అయితే ఈ మ్యాచ్ కు కామెంటేటర్ గా వ్యవరించిన సెహ్వాగ్.. మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ.. ఈ మ్యాచ్ లో పంత్ అద్భుతంగా ఆడాడు. ఇక విల్లే బౌలింగ్ లో ఆఖరి బంతిని కూడా పంత్ బౌండరీకి పంపి ఉంటె.. మ్యాచ్ అప్పుడే గెలిచేవాళ్ళం. అలాగే ఆ సింగిల్ కూడా పరిగెత్తాల్సిన పని ఉండేది కాదు. పంత్ దానికి ఫోర్ కాకుండా సిక్స్ కొడితే ఇంకా సూపర్ గ అందేది. అయితే నేను ఒక్కవేళ అక్కడ పంత్ స్థానంలో ఉంటె.. తప్పకుండ సిక్స్ కొట్టేవాడిని అని సెహ్వాగ్ పేర్కొనాడు. అయితే సెహ్వాగ్ కు ఇలాంటి పనులు బాగా అలవాటు అనేది తెలిసిందే. సెంచరీలనుగాని.. చివరి రన్స్ ను గాని సెహ్వాగ్ సిక్స్ లతోనే చేరుకుంటాడు.

ఇవి కూడా చదవండి :

వన్డేలకు స్టోక్స్ గుడ్‌ బై..!

పంత్ విషయంలో మళ్ళీ వక్ర బుద్ధి చూపించిన ఇంగ్లాండ్ బోర్డు..!

Visitors Are Also Reading