Home » వన్డేలకు స్టోక్స్ గుడ్‌ బై..!

వన్డేలకు స్టోక్స్ గుడ్‌ బై..!

by Azhar
Ad

ఇన్ని రోజులు మన ఇండియా జట్టు ఇంగ్లాండ్ పర్యాటనలో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. అక్కడ ఒక్క టెస్ట్, మూడు టీ20, మూడు వన్డే మ్యాచ్ లు ఆడటానికి వేలిందిహ్ భారత జట్టు. ఇక నిన్నే ఈ పర్యటనను విజయవంతంగా ముగించుకొని.. టీ20, వన్డే సిరీస్ ను తన పేరిట లికించుకుంది. అయితే ఇందులో నిన్నే ఇండియా తో వన్డే మ్యాచ్ ఆడిన ఆడిన జట్టులోని స్టార్ ప్లేయర్ బెన్ స్టోక్స్ అభిమానులకు అందరికి ఊహించని షాక్ అనేది ఇచ్చాడు. ఇక తాను వన్డే ఫార్మాట్ కు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నాను అని ప్రకటించాడు.

Advertisement

అయితే ఈ విషయాన్ని స్టోక్స్ తన ఇంస్టాగ్రామ్ వేదికగా పోస్ట్ చేసాడు. అయితే నిన్న ఇండియాతో మూడు వన్డేల సిరీస్ అనేది ముగించుకున్న ఇంగ్లాండ్ జట్టు.. రేపటి నుండి సౌత్ ఆఫ్రికాతో మూడు వన్డేల సిరీస్ లో పాల్గొనబోతుంది. ఈ క్రమంలో సఫారీలతో జరగబోయే.. మొదటి వన్డే మ్యాచ్ అనేది తనకు ఆఖరి వన్డే మ్యాచ్ అని స్టోక్స్ పేర్కొన్నాడు. ఈ విషయంపై తన సోషల్ మీడియాలో… డర్హామ్‌లో మంగళవారం వన్డే క్రికెట్‌లో ఇంగ్లండ్ తరఫున నా చివరి మ్యాచ్ ఆడతాను. నేను ఈ ఫార్మాట్ నుండి రిటైర్ అవ్వాలని నిర్ణయించుకున్నాను. ఇది చాలా కఠినమైన నిర్ణయం. ఇంగ్లండ్‌లో నా సహచరులతో కలిసి ఆడే ప్రతి నిమిషం నాకు చాలా ఇష్టం. మేము ఈ క్రికెట్ లో ఒక అద్భుతమైన ప్రయాణం చేసాము.

Advertisement

ఇక నేను ఇప్పుడు ఈ వన్డే ఫార్మాట్ లో నా 100 శాతం అనేది ఇవ్వలేకపోతున్నాను. నా శరీరం అనేది సంహరించడం లేదు. ఇప్పుడు నా స్థానంలో మరో ఆటగాడు జట్టులోకి వచ్చి.. తన ప్రతిభ చూపించాలి అనుకుంటున్నాను. ఇక ఈ నిర్ణయంతో నేను టెస్ట్ ఫార్మాట్ అలాగే టీ20 ఫార్మాట్ కు నాలో ఉన్నది మొత్తం ఇవ్వగలను. ఇప్పటివరకు నేను ఆడిన 104 వన్డే మ్యాచ్ .లు అనేవి… నేను ఎంతో ఇష్టంతో ఆడాను. అయితే ఇంకా ముందు ముందు చాలా విజయాలు సాధించాలని అనుకుంటున్నాను. ఇక నా హోమ్‌గ్రౌండ్‌ అయిన డర్హామ్‌లో నా చివరి గేమ్‌ను ఆడడం అద్భుతంగా అనిపిస్తుంది అని స్టోక్స్ పేర్కొన్నాడు.

ఇవి కూడా చదవండి :

రీ-ఎంట్రీ ఇస్తా అంటున్న పాక్ పేసర్ మహమ్మద్ అమీర్…!

పంత్ విషయంలో మళ్ళీ వక్ర బుద్ధి చూపించిన ఇంగ్లాండ్ బోర్డు..!

Visitors Are Also Reading