ఐపీఎల్ 2022 లో కృనల్ పాండ్యను లక్నో యాజమాన్యం 8 కోట్ల కంటే ఎక్కువ ధరకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. దాంతో అతనికి చాలా ఇచ్చారని అప్పట్లో విమర్శలు కూడా వచ్చాయి. కృనల్ కు అంత రేంజ్ లేదని.. అతను ఓ మాములు ఆల్ రౌండర్ అని చాలా మంది అన్నారు. కానీ ఈ సీజన్ లో మాత్రం కృనల్ బాగా రాణిస్తున్నాడు.
Advertisement
నిన్న లక్నో, పంజాబ్ జాట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో తమ జట్టు విజయంలో కృనల్ కూడా ముఖ్యపాత్ర పోషించాడు. 160 కంటే తక్కువ పరుగుల లక్ష్యాన్ని కాపాడే క్రమంలో కృనల్ ఎంతో తెలివిగా బౌలింగ్ చేసాడు. బ్యాటింగ్ లో పెద్దగా రాణించలేకపాయినా బౌలింగ్ లో మాత్రం అదరగొట్టాడు. తన నాలుగు ఓవర్ల స్పెల్ లో కేవలం 11 పరుగులు మాత్రమే ఇచ్చి 2 కీలక వికెట్లు కూడా తీసుకున్నాడు. దాంతో అతనికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కూడా వచ్చింది.
Advertisement
దాంతో కృనల్ ను విమర్శించినా వారికీ భారత మాజీ డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ గట్టి సమాధానం ఇచ్చాడు. నాకు తెలిసి కృనల్ కు ఎక్కువ ధర.. కాదు తక్కువ ధరే వచ్చింది. అతనికి ఎన్నో టీ20 మ్యాచ్ లు ఆడిన అనుభవం ఉంది. ఆ అనుభవానికి తగ్గిన ధరే లభించింది. అతను ఎంతో పటిష్టంగా బౌలింగ్ చేస్తున్నాడు. లక్నో విజయాలలో ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు అని సెహ్వాగ్ అన్నాడు.
ఇవి కూడా చదవండి :
కోహ్లీ ప్లాప్ షో పై దాదా కీలక వ్యాఖ్యలు…!
హిందువునని పాక్ జట్టులో అవహేళన చేసేవారు..!