భాద్రపద శుద్ధ చవితి రోజున గజాననుడు విఘ్నేశ్వరుడైనాడు. అందుకు దేవతలు, ఋషులు, మానవులు అందరూ సంతోషపడి విఘ్నేశ్వరునికి అనేక రకాలైన పిండివంటలు, కుడుములు, టెంకాయలు, పాలు, పళ్ళు, వడపప్పు, పానకం సమర్పించారు. విగ్నేశ్వరుడు సంతోషపడి తిన్నంత తిని తన వాహనానికి పెట్టి తీసుకెళ్లగలిగినంత తీసుకొని చీకటి పడే సమయానికి కైలాసం చేరుకున్నాడు. ఎప్పటిలాగే తన తల్లిదండ్రులకు నమస్కారం చేయబోతే తన వల్ల కాలేదు. విగ్నేశ్వరుడు అవస్థ పడుతుంటే శివుని శిరస్సుపై ఉన్న చంద్రుడు పకపక నవ్వాడు.
చంద్రుని చూపు సోకి వినాయకుని పొట్ట పగిలి కుడుములు అన్ని దొర్లుకుంటూ బయటకు వచ్చాయి. దీంతో పార్వతి దేవి ఆగ్రహించి చంద్రునిని శపించింది. ఓరి పాపాత్ముడా నీ చూపు తగిలి నా కుమారుడు అచేతనంగా పడి ఉన్నాడు. కాబట్టి నిన్ను చూసిన వాళ్ళు పాపాత్ములు. నీలపనిందలు పొందుతారు అని శపిస్తుంది. పార్వతీదేవి చంద్రుని శపిస్తున్న సమయంలో సప్త ఋషులు తమ భార్యలతో కలిసి యజ్ఞం చేస్తూ అగ్నికి ప్రదక్షిణ చేస్తుంటారు. ఆ సమయంలో అగ్ని దేవుడికి రుషి పద్మల మీద మొహం కలిగింది. కోరిక సంగతేమో గాని ఈ విషయం తెలిస్తే ఋషులు తనని శపిస్తారేమో అని అగ్నిదేవుడు భయంతో అగ్నిని క్షీణింపచేస్తాడు.
Advertisement
Advertisement
భర్త కోరిక తెలుసుకున్న అగ్నిదేవుడు భార్య స్వాహాదేవి ఒక్క అరుంధతి రూపం తప్ప మిగిలిన రుషిపద్మల రూపంలో అగ్ని దేవుడి వద్దకు చేరి ఆయన కోరిక తీర్చింది. దీంతో అగ్ని దేవునితో ఉన్నది తమ భార్యలేనని ఋషులు వారిని ఆకారణంగా త్యజించారు. శాపగ్రస్తుడైన చంద్రుని చూడడం వల్లే ఋషి భార్యలు నీలాపనిందలకు గురయ్యారని దేవతలు గ్రహించారు. వీరందరూ బ్రహ్మదేవునితో కలిసి కైలాసానికి వెళ్లారు. మరణించిన విగ్నేశ్వరుడునీ బ్రహ్మ దేవుడు తిరిగి బ్రతికించాడు. తర్వాత పార్వతీదేవిని శాపాన్ని ఉపసంహరించుకోమని కోరాడు. అప్పుడు పార్వతీదేవి ఏ రోజున చంద్రుడు విఘ్నేశ్వరుడిని చూసి నవ్వాడో ఆరోజు చంద్రుని చూడకూడదు అని శాపాన్ని కొంత సవరించింది. ఆ రోజు నుంచి అందరూ చవితినాడు చంద్రుని చూడకుండా జాగ్రత్తగా ఉంటారు.
ఇవి కూడా చదవండి
IND VS PAK : కోహ్లీ, రాహుల్ సెంచరీలు.. పాక్ బౌలింగ్ బెంబేలు
తన బయోపిక్ చేసేందుకు 1000 కోట్లు డిమాండ్ చేస్తున్న కోహ్లీ ?
కోలీవుడ్ హీరోతో రకుల్ ప్రేమాయణం..ఖరీదైన కారు గిఫ్ట్ ఇచ్చాడా..?