అలనాటి సావిత్రి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. తెలుగులో మహానటులు ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లతో కలిసి ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. సావిత్రి అటు తమిళనాట ఎంజీఆర్, శివాజీ గణేష్ లాంటి స్టార్ నటులతో కలిసి నటించి ఎంతో గొప్ప పేరు సంపాదించారు. తెలుగు చిత్త పరిశ్రమ పుట్టినిల్లు అయితే, తమిళ చిత్ర పరిశ్రమ మెట్టినిల్లు అని సావిత్రి అనేవారు. బాలీవుడ్ లో సైతం ఆమె చెరగని ముద్ర వేసింది.
Advertisement
అయితే, మహానటి సావిత్రి జీవితంలో ఎన్నో మలుపులు, మరెన్నో ఆసక్తికరమైన అంశాలు కనిపిస్తూ ఉంటాయి. అలాంటి సావిత్రి కూతురు విజయ చాముండేశ్వరి, ఆమె భర్త గోవిందరావు ఇద్దరు కలిసి మొదటిసారిగా ఓ ప్రముఖ టీవీకి ఇంటర్వ్యూ ఇచ్చారు. సావిత్రి ఇంట్లో అప్పట్లో బంగారం కేజీల కొద్దీ ఉండేదని ఇప్పటికి చెప్పుకుంటూ ఉంటారు. ఆ విషయాన్ని వారు ప్రస్తావించారు. విజయ చాముండేశ్వరి మాట్లాడుతూ, “మొదటి నుంచి కూడా బంగారు ఆభరణాలు అంటే ఆమెకు చాలా ఇష్టం. జువెలరీ షాప్ ల ఓపెనింగ్స్ కి ఆమెను పిలిస్తే తప్పకుండా వెళ్లేది. ఆ షాపు వారికి మంచి బిజినెస్ ఇవ్వాలని ఉద్దేశంతో తెగ కొనేసేది. అమ్మ నగలు బీరువా నిండుగా ఉండేదన్నారు.
Advertisement
“బాక్సులు బీరువాలు సరిపోయేది కాదు. అందువలన బంగారు గాజుల్లోకి రిబ్బన్ దూర్చి మూడేసేది. అలా రిబ్బన్ కట్టిన గాజులు బీరువాలో చాలా ఉండేవని అమ్మ స్నేహితులు చెబుతుంటారు” అని అన్నారు. “అందువల్లనే ఇన్కమ్ టాక్స్ వారు ముందుగా వాటిపైనే పడ్డారు. నాకు బాగా గుర్తు, బీరువాల్లోనే నగలను బాక్స్ లో తీసుకొని వెళ్లడం వాళ్ళకి కుదరలేదు. అందువలన పెద్ద బెడ్ షీట్ ను కిందపరిచి నగలన్నీ కుప్పగా పోసి పెద్ద మూటగట్టి తీసుకుపోయారు. ఇష్టపడి చేయించుకున్న నగలను అలా తీసుకొని వెళ్తుంటే అమ్మ చాలా బాధపడింది” అని చెప్పుకొచ్చారు.
READ ALSO : తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఇంటర్ పూర్తవ్వగానే సాఫ్ట్‌వేర్ జాబ్..రూ. 2,50,000 జీతం!