అలనాటి మేటినటీమణుల్లో మహానటి సావిత్రి అంటే తెలియని వారు ఉండరు. తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే ఒక ప్రత్యేకమైన పేజీలను క్రియేట్ చేసుకున్నారు మహానటి సావిత్రి.. ఆమె తన అందం, అభినయంతో దేశవ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్నారు.. అప్పట్లో ఎన్టీఆర్, ఏఎన్నార్ వంటి స్టార్ హీరోలతో సమానంగా రెమ్యూనరేషన్ తీసుకున్న ఏకైక హీరోయిన్ సావిత్రి అని చెప్పవచ్చు. ఆమె ఎంత సంపాదించిందో అంతకంటే ఎక్కువ పేదలకు దానాలు చేసింది. చివరి రోజుల్లో మరీ దారుణంగా పరమపదించింది.. ఇదంతా పక్కన పెడితే తెలుగు సినిమా ఇండస్ట్రీలో గరికపాటి వరలక్ష్మిది కూడా ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది.
Advertisement
also read:రాజమౌళి సినిమా కోసం మహేష్ బాబు కీలక నిర్ణయం.. ఇక నుంచి అదే ఫాలో కానున్నారా..?
Advertisement
ఈమె స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమయంలోనే చాలామంది హీరోలకు తల్లిపాత్రలు కూడా చేసింది. గయ్యాళి పాత్రలు అంటే వరలక్ష్మికి కూడా సెట్ అవుతాయని చాలామంది అనేవారు. ఒకానొక రోజు వరలక్ష్మి మేకప్ రూమ్ లో రెడీ అవుతోంది. అప్పటికే సావిత్రి రెడీ అయ్యి తన తండ్రి పక్కన కూర్చుంది. కాసేపటికి చాయాగ్రాహకుడు వచ్చి వెనక నుండి సావిత్రిని వరలక్ష్మి అనుకొని ఆమె భుజంపై చెయ్యేసి పని కంప్లీట్ అయితే రా అంటూ అన్నారట.. ఆయన చేసిన పనికి కోపానికి వచ్చిన సావిత్రి కళ్ళు కనపడడం లేదా అని కోపంగా అడిగిందట..
సారీ మేడం నేను వరలక్ష్మి అనుకున్నాను క్షమించండి అని సావిత్రిని అడిగాడట. అయినా సావిత్రి నాన్నా ఆగకుండా ఆ ఛాయాగ్రహకున్ని తిట్టడం మొదలుపెట్టాడు. అంతేకాకుండా వరలక్ష్మిని కూడా తిడుతున్నాడు.. ఈ విషయం తెలుసుకున్న వరలక్ష్మి నన్ను ఎవడ్రా తిట్టేది అంటూ చెప్పు పట్టుకుని బయటకు వచ్చింది. సావిత్రి నాన్నకు చెప్పు కూడా చూపించింది. దీంతో కోపానికి వచ్చిన సావిత్రి మా నాన్నను తిడతావా అంటూ కోపం ఆపుకోలేక వరలక్ష్మిని తిడుతూ కొట్టడానికి వెళ్ళింది.. కానీ అక్కడ ఉన్న వారంతా ఆపడంతో కాసేపటికి గొడవ సర్దుమనిగింది.
also read: