Home » కరోనాతో ఆస్పత్రిలో చేరిన లెజెండరీ నటుడు సత్య రాజ్…!

కరోనాతో ఆస్పత్రిలో చేరిన లెజెండరీ నటుడు సత్య రాజ్…!

by AJAY
Ad

కరోనా కలకలం మళ్ళీ మొదలైంది. దేశంలో కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఇక సాధారణ ప్రజలతో పాటు ప్రజా ప్రతినిధులు, సెలబ్రిటీలు సైతం కరోనా బారిన పడటం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే ఇండస్ట్రీ నుండి పలువురు సినీ తారలు కరోనా బారిన పడ్డారు. వారిలో మంచు విష్ణు, మహేష్ బాబు, మంచు లక్ష్మి, సంగీత దర్శకుడు తమన్ సహా పలువురు ఐసోలేషన్ లో చికిత్స తీసుకుంటున్నారు.

Advertisement

Advertisement

కాగా తాజాగా ఇండస్ట్రీ నుండి మరో వ్యక్తి కరోనా బారిన పడ్డారు. బాలీవుడ్, కోలీవుడ్ మరియు టాలీవుడ్ లో వరుస సినిమాలతో బిజీగా ఉన్న ప్రముఖ నటుడు సత్యరాజ్ కు కరోనా పాజిటివ్ వచ్చింది. కరోనా లక్షణాలు ఎక్కువగా ఉండడంతో సత్యరాజ్ ఆస్పత్రిలో చేర్చినట్లు తెలుస్తోంది. సత్య రాజ్ కు కరోనా పాజిటివ్ వచ్చినట్టు నిర్ధారణ అయిన అనంతరం అతడి కుటుంబ సభ్యులు చెన్నైలోని ఆసుపత్రిలో చేర్పించినట్లు తమిళ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

 

ఇదిలా ఉండగా సత్య రాజ్ తెలుగులో మిర్చి సినిమాతో పాపులారిటీ సంపాదించుకున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ కు తండ్రి గా నటించి తన నటనతో ఆకట్టుకున్నారు. అంతేకాకుండా మళ్లీ ప్రభాస్ హీరోగా నటించిన బాహుబలి సినిమాలో ప్రభాస్ కట్టప్ప పాత్రలో అలరించారు. ఈ సినిమాతో సత్యరాజ్ కు దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది.

Visitors Are Also Reading