Home » SARKARU VARI PATA : స‌ర్కారు వారి పాట అప్డేట్…మ‌హేశ్ లుక్ మామూలుగా లేదుగా…!

SARKARU VARI PATA : స‌ర్కారు వారి పాట అప్డేట్…మ‌హేశ్ లుక్ మామూలుగా లేదుగా…!

by AJAY
Ad

సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు హీరోగా న‌టిస్తున్న తాజా సినిమా స‌ర్కారు వారి పాట. ఈ సినిమాలో మ‌హేశ్ బాబుకు జోడీగా కీర్తి సురేష్ హీరోయిన్ గా న‌టిస్తోంది. ప‌రుషురామ్ ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. మైత్రీ మూవీమేక‌ర్స్ మ‌రియు 14 రీల్స్ బ్యాన‌ర్ లు ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్త‌య్యింది. ఇదిలా ఉంటే ఈ సినిమా పోస్ట‌ర్ ను చిత్ర‌యూనిట్ తాజాగా విడుద‌ల చేసింది.శివ‌రాత్రి సంద‌ర్భంగా ఫ్యాన్స్ కు ట్రీట్ ఇచ్చేందుకు ఈ సినిమా పోస్ట‌ర్ ను విడుద‌ల చేశారు.

Advertisement

Advertisement

ఈ చిత్రంలో ఎంట‌ర్టైన్ మెంట్ తో పాటూ భారీ యాక్ష‌న్ సీన్ లు ఉంటాయ‌ని ఇప్ప‌టికే మేక‌ర్స్ ప్ర‌క‌టించ‌గా పోస్టర్ సినిమాలో ఏ రేంజ్ లో యాక్ష‌న్ సీన్లు ఉంటాయో తెలిపేలా క‌నిపిస్తుంది. దుబాయ్ తో పాటూ గోవా మ‌రియు స్పెయిన్ లో ఈ సినిమాకు సంబంధింనిన కీల‌క స‌న్నివేశాల‌ను తెర‌కెక్కించారు. ఇదిలా ఉంటే తాజాగా విడుద‌ల చేసిన పోస్ట‌ర్ లోని మ‌హేశ్ బాబు యాక్ష‌న్ స్టిల్ ఎంత‌గానో ఆక‌ట్టుకుంటోంది. ఇక ఈ చిత్రానికి త‌మ‌న్ స్వరాలు స‌మ‌కూరుస్తుండ‌గా స‌ముద్ర‌ఖని సినిమాలో విల‌న్ పాత్ర‌లో న‌టిస్తున్నారు. మే12న చిత్రాన్ని విడుద‌ల చేస్తున్న‌ట్టు చిత్ర యూనిట్ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.

Visitors Are Also Reading