పెళ్లి గురించి తన మనసులో ఉన్న మాటను బయట పెట్టింది సైఫ్ అలీఖాన్ ముద్దుల కూతురు సారా అలీఖాన్ ఇప్పుడిప్పుడే బాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంటున్నది ఈ భామ. వరుస సినిమాలు చేస్తూ స్టేటస్ సినిమాల వైపు అడుగులు వేస్తుంది.
Advertisement
ఈ రోజుల్లో అమ్మాయిలు ఎలా ఉన్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మరీ ముఖ్యంగా హీరోయిన్లు అయితే నెక్ట్స్ లెవల్ అంతే. బాలీవుడ్ ముద్దుగుమ్మలు ఇందులో మరింత ముదుర్లు. ఒక్కొక్కరూ ఒక్కో విధంగా ఆలోచిస్తుంటారు. కొందరు పెళ్లి తరువాత కలిసి ఉందామని అంటుండగా.. మరికొందరూ మాత్రం పెళ్లి తరువా ఎవరి లైఫ్ వారిదే అన్నట్టు ఉంటారు. వేరే కాపురం పెట్టేసి ఎవరితో సంబంధం లేనట్టు బతికేస్తుంటారు.
ఇప్పుడు ఈ రెండు రకాలు కాకుండా మూడవ రకం ఆలోచనలతో వచ్చింది సైఫ్ అలీఖాన్ కూతురు సారా అలీఖాన్. ఇప్పుడిప్పుడే బాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంటున్నది. వరుస సినిమాలు చేస్తూ స్టార్ స్టేటస్ వైపు అడుగులు వేస్తుంది. ఇప్పటికే సింబా, కేదర్‌నాథ్, అంతరింగీ రే వంటి సినిమాల్లో నటించి మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఈ మధ్య విడుదల అంతరంగీరే లో సారా నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కుతున్నాయి.
Advertisement
ఈ చిత్రంలో ధనుష్, అక్షయ్‌కుమార్‌లు హీరోలుగా నటించారు. ఆనంద్ ఎల్.రాయ్ దర్శకుడు. ఈ చిత్రం సక్సెస్ మీట్‌లో పాల్గొన్న సారా తన పెళ్లి, కాబోయే భర్తపై ఆసక్తికరంగా వ్యాఖ్యానించింది. అంతరంగీరే చూసి అమ్మానాన్నలు గర్వంగా ఫీల్ అయ్యారని, నటనకు కన్నీళ్లు పెట్టుకున్నారు అని చెప్పుకొచ్చింది. ఎప్పటికైనా తల్లే తనకు సర్వమని పేర్కొంది సారా. పెళ్లి కూడా ఆమె ఇష్టప్రకారమే జరుగుతుందని, ముఖ్యంగా అమ్మతో ఉన్నప్పుడు తాను సంతోషంగా ఉంటాను అని చెప్పింది.
ఇక ఇప్పటికీ తాను కొన్ని విషయాల్లో సొంత నిర్ణయాలు తీసుకోలేను అని, అమ్మసాయం లేకుండా ఏమి చేయలేను అంటుంది ఈభామ. చివరికీ మ్యాచింగ్ గాజులు, డ్రెస్‌ల విషయంలో కూడా తల్లి సాయం తీసుకుంటాను అంటూ నవ్వెసింది. తాను ఎక్కడికెళ్లిన వెళ్లి తిరిగి అమ్మనే చేరుతాను అంటూ పేర్కొంది.
పెళ్లి విషయంలో కూడా తనను చేసుకోబోయే వాడు కచ్చితముగా అమ్మకు నచ్చడమే కాదు. తను, అమ్మతో కలిసి ఉండాలనే కండీషన్ కూడా పెట్టింది. అత్తారింటికి వెళ్లను అని, తనను అమ్మతో పాటు ఉంచేవాడు అయితేనే పెళ్లి చేసుకుంటాను అని సారా అలీఖాన్ క్లారిటీ ఇచ్చింది. ఇల్లరికం వచ్చేవాడితోనే మూడు ముళ్లు వేయించుకుంటాను అని సారా కన్ఫర్మ్ చేసింది.