Home » “సంతోషం” సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తున్నాడా..? ఇప్పుడు ఎలా ఉన్నాడో ఏం చేస్తున్నాడో తెలుసా..?

“సంతోషం” సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తున్నాడా..? ఇప్పుడు ఎలా ఉన్నాడో ఏం చేస్తున్నాడో తెలుసా..?

by AJAY
Ad

సినిమాలో హీరోలు హీరోయిన్ ల త‌ర‌వాత చైల్డ్ ఆర్టిస్ట్ ల‌కు కూడా మ‌ళ్లీ అంత‌టి క్రేజ్ వ‌స్తుంది. సాధార‌ణంగానే చిన్న పిల్ల‌లు అంటే అంద‌రూ ఇష్ట‌ప‌డ‌తారు. ఇక అలా చిన్న వ‌య‌సులోనే తెర‌పై న‌టించ‌డం అంటే మూమాలు విష‌యం కాదు. కాబ‌ట్టి ఏ సినిమాలో అయినా క‌నిపించే చైల్డ్ ఆర్టిస్ట్ ల‌కు తెగ క్రేజ్ వ‌స్తుంది. చూడ్డానికి ముద్దుగా ఉండి త‌మ ముద్దు ప‌లుకుల‌తో ఆక‌ట్టుకోగ‌లిగితే ఆ క్రేజ్ డ‌బుల్ అవుతుంది. ఇక ఒక‌ప్పుడు టాలీవుడ్ లో న‌టించిన చాలా మంది చైల్డ్ ఆర్టిస్ట్ లు ప్ర‌స్తుతం సినిమాల్లో హీరోలు హీరోయిన్ లుగా న‌టిస్తున్నారు.

Advertisement

కాగా మ‌రి కొంద‌రు మాత్రం సినిమాల‌పై ఆస‌క్తి లేక‌నోఇత‌ర కార‌ణాల వ‌ల్ల‌నో ఇండ‌స్ట్రీని విడిచిపెట్టి వెళ్లిపోయారు. ఇక ఒక‌ప్పుడు నాగార్జున హీరోగా న‌టించిన సంతోషం సినిమాలో న‌టించిన చైల్డ్ ఆర్టిస్ట్ కూడా త‌న‌దైన న‌ట‌న‌తో ఆక‌ట్టుకున్నాడు. 2002లో వ‌చ్చిన ఈ సినిమాకు ద‌శ‌ర‌త్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా సినిమాలో నాగార్జున‌కు జోడీగా గ్రేసీ సింగ్ హీరోయిన్ గా న‌టించింది. ఈ సినిమాలో హీరోయిన్ శ్రీయ కూడా ముఖ్య‌మైన పాత్ర‌లో న‌టించింది.

Advertisement

ఇక ఈ సినిమాలో న‌టించిన బుడ్డోడు కూడా త‌న న‌ట‌న‌తో ఆక‌ట్టుకున్నాడు. ఆ బుడ్డోడి పేరు అక్ష‌య్ బ‌చ్చు…సినిమాలో నాగార్జున కొడుకుగా…. క‌ల్ల‌జోడు పెట్టుకుని బొద్దుగా అంద‌రి దృష్టిని ఆక‌ట్టుకున్నాడు. అక్ష‌య్ బ‌చ్చు సంతోషం సినిమా కంటే ముందు బాలీవుడ్ లో అనేక చిత్రాల‌లో న‌టించాడు. బాలీవుడ్ లో అక్ష‌య్ న‌ట‌న చూసే నాగార్జున సంతోషం సినిమాలో ఆఫ‌ర్ ఇచ్చాడు.

సంతోషం సినిమా త‌ర‌వాత క్రేజ్ రావ‌డంతో వ‌ర్షం సినిమాలోనూ ఛాన్స్ కొట్టేశాడు. ఇక కొన్ని సినిమాల త‌ర‌వాత మ‌ళ్లీ చ‌దువు వైపు దృష్టి పెట్టాడు. ఇక ప్ర‌స్తుతం బుడ్డోడు పెద్దోడు అయ్యాడు. బాలీవుడ్ సినిమాలు మ‌రియు సీరియ‌ల్స్ లో న‌టిస్తూ బిజీగా ఉన్నాడు. చైల్డ్ ఆర్టిస్ట్ గా ప‌న్నెండు సినిమాలు చేయ‌డంతో పాటూ టీవీ యాడ్స్ లోనూ న‌టించాడు. మ‌రి సంతోషం తో వ‌చ్చిన క్రేజ్ తో తెలుగులో రీఎంట్రీ ఇస్తాడా లేదా చూడాలి.

ALSO READ :  క‌ళ్యాణ్ రామ్ సంచ‌ల‌న నిర్ణ‌యం.. అలా జ‌రిగితే సినిమాలు మానేస్తా..!

Visitors Are Also Reading