Home » క‌ళ్యాణ్ రామ్ సంచ‌ల‌న నిర్ణ‌యం.. అలా జ‌రిగితే సినిమాలు మానేస్తా..!

క‌ళ్యాణ్ రామ్ సంచ‌ల‌న నిర్ణ‌యం.. అలా జ‌రిగితే సినిమాలు మానేస్తా..!

by Anji
Ad

నంద‌మూరి కుటుంబానికి ఆధ్యుడు నంద‌మూరి తార‌క రామారావు. ఆయ‌న‌ను స్పూర్తిగా తీసుకొని కేవ‌లం వారి కుటుంబ స‌భ్యులే కాదు.. యావ‌త్ తెలుగు రాష్ట్రాల‌ ఎన్టీఆర్ అభిమానులు అంద‌రూ ఉన్నారు. నంద‌మూరి కుటుంబంలో ఇప్పుడు హీరోలుగా రాణిస్తున్న వారిలో ముఖ్యంగా బాల‌కృష్ణ‌, జూనియ‌ర్ ఎన్టీఆర్, క‌ళ్యాణ్ రామ్ ప్ర‌దానంగా ఉన్నారు. ఇప్ప‌టికే బాల‌కృష్ణ ఓవైపు హిందూపురం ఎమ్మెల్యేగా కొన‌సాగుతూనే మ‌రోవైపు సినిమాలు చేస్తున్నాడు. ఇక మిగిలిన ఎన్టీఆర్, క‌ళ్యాణ్ రామ్ లు సినిమా విడుద‌ల సంద‌ర్భంగా లేదా మ‌రే సంద‌ర్భంలోనైనా మీడియా ముందుకు వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా వారికి ప్ర‌ధానంగా పాలిటిక్స్ కి సంబంధించిన ప్ర‌శ్న‌లు ఎదుర‌వుతున్నాయి.


ఇక ప్ర‌స్తుతం త‌మ దృష్టి అంతా సినిమాల మీద‌నే ఉంద‌ని.. ఎన్నిసార్లు క్లారిటీ ఇచ్చిన‌ప్ప‌టికీ రాజ‌కీయాల్లోకి ఎప్పుడూ అడుగుపెడ‌తార‌నే ప్ర‌శ్న మాత్రం వారిద్ద‌రికీ త‌ర‌చూ ఎదుర‌వుతూనే ఉంటుంది. తాజాగా బింబిసార ప్ర‌చార కార్య‌క్ర‌మాల్లో బిజీగా ఉన్న క‌ళ్యాణ్ రామ్‌కి మ‌రోసారి పొలిటిక‌ల్ ప్ర‌శ్న ఎదురైంది. ఈ సారి క‌ళ్యాణ్ రామ్ కాస్త భిన్నంగానే స‌మాధానం చెప్పాడు. మామూలుగా మ‌నం ఒకేసారి రెండు ప‌డ‌వ‌ల్లో ప్ర‌యాణం చేయ‌లేం. ప్రస్తుతం నాఫోక‌స్ అంతా సినిమాలపైనే ఉంది. ఒక‌వేళ నేను రాజ‌కీయాల్లోకి అడుగుపెడితే అప్పుడు సినిమాల‌కు గుడ్ బై చెప్పేస్తా అని క‌ళ్యాణ్ రామ్ చెప్పుకొచ్చాడు.

Advertisement

Advertisement


ఇప్పుడిప్పుడే క‌ళ్యాణ్‌రామ్ హీరోగా నిల‌దొక్కుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్నాడు. ప‌టాస్ సినిమా త‌రువాత ఆ స్థాయి హిట్ అందుకోలేని క‌ళ్యాణ్ రామ్‌, బింబిసార మీద‌నే ఆశ‌లు పెట్టుకున్నాడు. ఈ సినిమా త‌న‌ని ట్రాక్‌లోకి తీసుకొస్తుంద‌ని చాలా న‌మ్మ‌కంగానే ఉన్నాడు. రాజుగా న‌టిస్తున్న క‌ళ్యాణ్ స‌ర‌స‌న కేథ‌రిన్ తెరిసా, సంయుక్త మేన‌న్‌లు క‌థానాయిక‌లుగా న‌టిస్తున్నారు. ఆగ‌ష్టు 05న ఈ చిత్రం గ్రాండ్‌గా విడుద‌ల‌వ్వ‌నుంది. ఇక ఎన్టీఆర్ విష‌యానికి వ‌స్తే.. సేమ్ సీనే రిపీట్ అవుతుంది. కాక‌పోతే ఎన్టీఆర్ కెర‌ర్ ఇప్పుడు పుల్ స్వింగ్‌లో ఉంది కాబ‌ట్టి రాజ‌కీయాల గురించి ప‌ట్టించుకోవ‌డం లేదు. కొర‌టాల శివ‌తో తార‌క్ త‌న త‌దుప‌రి సినిమాను ప్రారంభించాల్సి ఉంది. క‌ళ్యాణ్ రామ్ బింబిసార ఎలా ఉంటుందో చూడాలి మ‌రి.

Also Read : 

క‌ల్యాణ్ రామ్ భార్య స్వాతి ఎవ‌రి కూతురో తెలుసా…? ఆమె బ్యాగ్రౌండ్ తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోవాల్సిందే..?

శ‌ర‌వ‌ణ‌న్ కు జోడీగా న‌టించే ఛాన్స్ మిస్ చేసుకున్నసౌత్ ఇండియ‌న్ స్టార్ హీరోయిన్ ఎవ‌రో తెలుసా..?

Visitors Are Also Reading