భారత క్రికెటర్లలో ఎంతో మంచి అభిమానులను సంపాదించుకున్న యువ ఆటగాడు సంజూ శాంసన్. కానీ అతనికి తన ప్రతిభకు తగిన అవకాశాలు బీసీసీఐ ఇవ్వడం లేదు అనే ఆలోచన ప్రతి క్రికెట్ అభిమానుల్లోనూ ఉంది. అయితే ఈ ఏడాది జరగనున్న టీ20 ప్రపంచ కప్ కు సంజూని ఎంపిక చేయని బీసీసీఐ.. కనీసం అతని సొంత రాష్ట్రంలో సౌత్ ఆఫ్రికాతో జరిగే టీ20 సిరీస్ కూడా ఎంపిక చేయలేదు.
Advertisement
దాంతో భారత అభిమానులు బీసీసీఐపై చాలా ఆగ్రహంతో ఉన్నారు. అయితే ఇప్పుడు వారిని శాంతపరచడానికి బీసీసీఐ ఓ కొత్త ఆలోచన చేస్తుంది అని తెలుస్తుంది. సౌత్ ఆఫ్రికాతో టీ20 సిరీస్ ముగిసిన తర్వాత వన్డే సిరీస్ కూడా ఆడనుంది భారత జట్టు. కానీ ఈ వన్డే సిరీస్ కు కెప్టెన్ రోహిత్ శర్మతో సహా.. టీ20 ప్రపంచ కప్ కు ఎంపిక చేసిన చాలామంది ఆటగాళ్లను పక్కన పెట్టనుంది.
Advertisement
ఇక సఫారీలతో జరిగే ఈ సిరీస్ కు శిఖర్ ధావన్ కెప్టెన్ గా వ్యవరించనున్నాడు. అయితే ధావన్ డిప్యూటీగా వైస్ కెప్టెన్ గా బీసీసీఐ సంజూ శాంసన్ ని ఎంపిక చేయనున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం న్యూజిలాండ్ ఏ తో జరుగుతున్న వన్డే సిరీస్ లో భారత్ ఏకు కెప్టెన్ గా వ్యవరిస్తున్న సంజూ పట్ల బీసీసీఐ సంతృప్తి చెందింది అని.. అందుకే సంజూకు ఈ అవకాశం అనేది ఇవ్వనుంది అని తెలుస్తుంది.
ఇవి కూడా చదవండి :