టీమిండియా వికెట్ కీపర్ సంజు శాంసన్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. బ్యాటింగ్, కీపింగ్ తో దూసుకుపోతున్నాడు ఈ ప్లేయర్. అయితే, భారత జట్టులో సంజు శాంసన్ కు సరైన అవకాశాలు రాకపోవడం పై అభిమానులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సెలెక్టరులు కావాలని సంజు శాంసన్ విషయంలో వివక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు అంటూ దుమ్మెత్తి పోస్తున్నారు.
read also : పవన్ కళ్యాణ్ 3వ భార్య ఆస్తులు విలువ తెలుసా? ఎంతో తెలిస్తే దిమ్మతిరగాల్సిందే !
Advertisement
సంజు శాంసన్ కంటే కోచ్ కెప్టెన్ రిషబ్ పంత్ వైపే ఎక్కువగా ముగ్గు చూపుతున్నారు. సంజు శాంసన్ వన్డేలలో అద్భుతంగా రాణిస్తున్నప్పటికీ అతడు బెంచ్ కే పరిమితం కావాల్సి వస్తోంది. ఈ తరునంలో సంజు శాంసన్ కు అదిరిపోయే ఆఫర్ వచ్చినట్లు సమాచారం అందుతుంది. సంజు శాంసన్ కు పరాయి దేశం ఐర్లాండ్ బంపర్ ఆఫర్ ప్రకటించినట్లు తెలుస్తోంది. తమ దేశం తరపున అంతర్జాతీయ క్రికెట్ ఆడాలని శాంసన్ కు ఐర్లాండ్ క్రికెట్ బోర్డు ఆహ్వానం పలికినట్లు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
Advertisement
బీసీసీఐ, భారత క్రికెట్ తో తెగదింపులు చేసుకొని తమ దేశానికి వస్తే తమ జట్టు ఆడే అన్ని అంతర్జాతీయ మ్యాచ్ లు ఆడిస్తామని ఐర్లాండ్ క్రికెట్ బోర్డు హామీ ఇచ్చినట్లు సమాచారం. అయితే ఈ ఆఫర్ ను సంజు తిరస్కరించాడని తెలుస్తోంది. తాను భారత్ తరపున తప్ప మరే దేశం తరఫున క్రికెట్ ఆడేది లేదని ఖరాఖండిగా తెలిపినట్లు సమాచారం. అంతర్జాతీయ క్రికెట్ ఆడితే టీమిండియా కు మాత్రమే ఆడాలని కోరుకుంటారని, ఇతర దేశం తరఫున క్రికెట్ ఆడటాన్ని కలలో కూడా ఊహించలేనని తనను సంప్రదించిన ఐరిష్ ప్రతినిధులకు సంజు తెలిపాడని వార్తలు వస్తున్నాయి. కాగా, 28 ఏళ్ల సంజు తన ఏడేళ్ల అంతర్జాతీయ కెరీర్ లో కేవలం 27 మ్యాచ్ లు మాత్రమే ఆడిన సంగతి తెలిసిందే.
READ ALSO : BREAKING : తండ్రి కాబోతున్న స్టార్ హీరో రామ్‌చరణ్..మెగా ఫ్యామిలీలో సంబురాలు