Home » విరాట్ కోహ్లీ ఈ ఐపీఎల్ సీజన్ లో ఎందుకు ప్లాప్ అయ్యాడో మీకు తెలుసా..?

విరాట్ కోహ్లీ ఈ ఐపీఎల్ సీజన్ లో ఎందుకు ప్లాప్ అయ్యాడో మీకు తెలుసా..?

by Azhar
Ad

అంతర్జాతీయ క్రికెట్ లో 2019 నుండి సరిగ్గా రాణించలేకపోతున్నాడు. కానీ ఐపీఎల్ లో పర్వాలేదనిపిస్తు వచ్చాడు. కానీ ఈ ఐపీఎల్ 2022 సీజన్ లో మాత్రం కోహ్లీ పేలవ ఫామ్ పరాకాష్టకు చేరుకుంది. బెంగళూర్ ఆడిన 16 మ్యాచ్ లలో ఒక్క మ్యాచ్ మిస్ కాకుండా ఆడిన కోహ్లీ మాత్రం కనీసం నాలుగు వందల పరుగులు కూడా చేయలేకపోయాడు. అలాగే కేవలం రెండు హాఫ్ సెంచరీలు మాత్రమే చేయగలిగాడు. కోహ్లీ రాణించకపోయిన కెప్టెన్ ఫఫ్ డు ప్లెసిస్, దినేష్ కార్తీక్ వంటి ఆటగాళ్లు రాణించడంతో 8 విజయాలు నమోదు చేసిన బెంగళూర్.. అదృష్టం కొద్ది ప్లే ఆఫ్స్ కు చేరుకుంది.

Advertisement

ఆ తర్వాత లక్నో పై తప్పక గెలవాల్సిన ఎలిమినేటర్ మ్యాచ్ లో పర్వాలేదు కోహ్లీ చేతులెతేసిన రజత్ పటిదార్ సెంచరీతో ఛాలెంజర్స్ జట్టు క్వాలిఫైర్స్ 2లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక ఇక్కడ కూడా రాజస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో కేవలం 8 పరుగులు చేసి నిరాశపరిచాడు. అయితే ఈ మ్యాచ్ లో ప్రత్యర్థికి పెద్ద లక్ష్యం ఇవ్వలేకపోయిన బెంగళూర్ ఓడిపోయి ఇంటికి వెళాల్సి వచ్చింది. అయితే మీకు విరాట్ కోహ్లీ ఈ ఐపీఎల్ సీజన్ లో ఎందుకు ప్లాప్ అయ్యాడో తెలుసా.. ఆ కారణాన్ని సంజయ్ మంజ్రేకర్ బయట పెట్టాడు.

Advertisement

తాజాగా మంజ్రేకర్ మాట్లాడుతూ.. కోహ్లీ గొప్ప ఆటగాడు అనేది ఎవరు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఈ ఐపీఎల్ సీజన్ లో కోహ్లీ విఫలమయ్యాడు. ఎందుకంటే మామూలుగానే ఫ్రంట్ ఫుట్‌పై ఆడేందుకు కోహ్లీ ఎక్కువగా ఇష్టపడతాడు. కానీ ఆ పద్ధతే అతనికి కలిసి రావడం లేదు. అతను ఎంత మంచి ఆటగాడి అయిన టెక్నికల్ లోపాల్ని పూర్తిగా కప్పిపుచ్చుకోలేం. ఓ షార్ట్ పిచ్ బాల్‌.. అది కూడా బౌన్స్ అవుతున్న సమయంలో కోహ్లీ ఫ్రంట్ ఫుట్‌పై ఆడాలి అని చూసి రాజస్థాన్ పై అవుట్ అయ్యాడు అని తెలిపాడు మంజ్రేకర్.

ఇవి కూడా చదవండి :

ఐపీఎల్ లో హైదరాబాదీ చెత్త రికార్డ్..!

2 కోట్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లు నొక్కేసి ఐపీఎల్ బెట్టింగ్ ఆడిన పోస్ట్ మాస్టర్..!

Visitors Are Also Reading