Home » ఐపీఎల్ లో హైదరాబాదీ చెత్త రికార్డ్..!

ఐపీఎల్ లో హైదరాబాదీ చెత్త రికార్డ్..!

by Azhar
Ad

ఐపీఎల్ 2022లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ బౌలర్ మొహ్మద్ సిరాజ్ ఓ చెత్త రికార్డును తన పేరిట లికించుకున్నాడు. ఈ ఐపీఎల్ కు ముందు జరిగిన మెగా వేలంలో సిరాజ్ ను వదలకుండా బెంగళూర్ 7 కోట్లకు రిటైన్ చేసుకుంది. ఎందుకంటే ఈ ఐపీఎల్ కు ముందు గత ఏడాది జరిగిన నుండి ఏడాది పాటుగా సిరాజ్ మంచి ఫామ్ లో ఉన్నాడు. ఆ నమ్మకంతోనే ఈ హైదరాబాదీ బౌలర్ ను రిటైన్ చేసుకుంది. కానీ సిరాజ్ మాత్రం ఈ ఐపీఎల్ 2022 లో దారుణంగా విఫలమయ్యాడు.

Advertisement

ఇదే క్రమంలో ఐపీఎల్ చరిత్రలోనే ఓ చెత్త రికార్డ్ ను క్రియేట్ చేసాడు. అదేంటంటే ఒక్కే సీజన్ లో అత్యధిక సిక్సర్లు ఇచ్చిన బౌలర్ గా నిలిచాడు. గతంలో ఈ రికార్డ్ చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్ డ్వేన్ బ్రావో పేరిట ఉండేది. 2018 సీజన్ లో బ్రావో అత్యధికంగా 29 సిక్సర్లను ఇచ్చాడు. కానీ నిన్న బెంగళూర్ – రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య జరిగిన ఐపీఎల్ 2022 క్వాలిఫైర్స్ 2లో మొదటి ఓవర్ వేసిన సిరాజ్ బౌలింగ్ లో ప్రత్యర్థి జట్టు ఓపెనర్ యశస్వి జైస్వాల్ 2 సిక్సర్లు కొట్టాడు. దాంతో ఈ ఐపీఎల్ లో 30 సిక్సులు సిరాజ్ బౌలింగ్ లో పూర్తి కావడంతో బ్రావో పేరిట ఉన్న ఆ రికార్డ్ సీజర్ పేరిటాకు వచ్చింది.

Advertisement

అయితే ఆ తర్వాత మళ్ళీ సిరాజ్ వేసిన ఓవర్లో మరో సిక్స్ రావడంతో మొత్తం ఈ ఐపీఎల్ 2022 సీజన్ ను 31 సిక్స్ లతో ముగించాడు. అయితే ఇదే జాబితాలో ఈ జట్టులోని మరో బౌలర్ వానిందు హాసరంగా రెండో స్థానికి వచ్చాడు. ఈ ఐపీఎల్ లో మొత్తం 26 వికెట్లు తీసిన హాసరంగా 30 సిక్సులు ఇచ్చి రెండో స్థానానికి రావడంతో బ్రావో మూడో స్థానానికి వెళ్ళిపోయాడు. ఇక ఈ క్వాలిఫైర్స్ మ్యాచ్ లో బెంగళూర్ జట్టు ఓడిపోవడంతో ఈ ఏడాది కూడా ఆ జట్టు అభిమానులకు నిరాశే ఎదురైంది.

ఇవి కూడా చదవండి :

2 కోట్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లు నొక్కేసి ఐపీఎల్ బెట్టింగ్ ఆడిన పోస్ట్ మాస్టర్..!

భారత ఆటగాళ్ళకంటే ఎక్కువ జీతాలు అందుకుంటున్న ఆసీస్ ప్లేయర్స్..!

Visitors Are Also Reading