Ad
భారత మాజీ ఆటగాడు.. కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ విమర్శలకు కేరాఫ్ ఆడ్రస్ గా ఉంటాడు అనే విషయం తెలిసిందే. అయితే 2019 ప్రపంచ కప్ లో భారత స్టార్ ఆల్ రౌండర్ పై మంజ్రేకర్ అనుచిత వ్యాఖ్యలు చేసాడు. అవి పెద్ద దుమారమే లేపాయి. ఆ వ్యాఖ్యలకు జడేజాకూడా బదులిచ్చాడు. ఆ తర్వాత ఈ వివాదం మరింత ముదరడంతో.. ఇందులో తప్పు మంజ్రేకర్ దే అని భావించిన బీసీసీఐ… అతడిని కామెంట్రీ ప్యానల్ నుండి తొలగించింది. ఐపీఎల్ లో కూడా కామెంట్రీ చేయకుండా చర్యలు తీసుకుంది.
అయిన కూడా మంజ్రేకర్ ఏ మాత్రం మారలేదు. అప్పటి నుండి భారత ఆటగాళ్ల పైన ఇంకా ఎక్కువగా కామెంట్స్ చేయడం ప్రారంభించాడు. ఇక ఇప్పుడు తాజాగా మరోసారి జడేజాపై అనుచిత వ్యాఖ్యలు చేసాడు మంజ్రేకర్. జడేజాకు ఈ ఏడాది చివర్లో ఆస్ట్రేలియాలో జరగబోయే టీ20 ప్రపంచ కప్ లో చోటు దక్కదు అని పేర్కొన్నాడు. అయితే మంజ్రేకర్ మాట్లాడుతూ… ఫిట్నెస్ లేకపోవడంతో జారులో చోటు కోల్పోయిన హార్దిక్ పాండ్య ఇప్పుడు అద్భుతంగా రాణిస్తున్నాడు. బ్యాటింగ్, బౌలింగ్ లో మళ్ళీ తాను ఏంటో చూపిస్తున్నాడు. అలాగే సీనియర్ ఆటగాడు దినేష్ కార్తీక్ కూడా మంచి ఫేమ్ లో ఉన్నాడు.
ఈ ఐపీఎల్ సీజన్ లోనే కాకుండా.. సౌత్ ఆఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్ లో కూడా తాను బెస్ట్ ఫినిషర్ అని నిరూపించుకున్నాడు. అందువల్ల వీరు ప్రపంచ కప్ జట్టులో ఉంటారు. అలాగే బెస్ట్ స్పిన్ ఆల్ రౌండర్ అయిన అక్షర్ పటేల్ కూడా జట్టులో ఉంటాడు. కాబట్టి జడేజాకు జట్టులో చోటియూ కష్టం. ఎందుకంటే పంత్ తర్వాత 6, 7 స్థానంలో బ్యాటింగ్ కు పాండ్య, కార్తీక్ వస్తాడు. ఆ తర్వాత స్పిన్ ఆల్ రౌండర్ అక్షర్ వస్తాడు. కాబట్టి జడేజాను జట్టులో ఉంచలేరు. ఒకవేళ జడేజా కావాలంటే పాండ్య, కార్తీక్ లోనే ఒక్కరిని తప్పించాలి. అలా చేయాలంటే జడేజా వారికంటే బాగా బ్యాటింగ్ చేయాలి. కానీ ఇప్పుడు జడేజా ఫామ్ లో లేడు. అందుకే అతడిని ప్రపంచ కప్ కు ఎంపిక చేయడం కష్టం అని మంజ్రేకర్ పేర్కొన్నాడు.
ఇవి కూడా చదవండి :
ఇండియా , పాకిస్థాన్ క్రికెట్ లో ఉన్న తేడా ఏంటో చెప్పిన ప్లేయర్…!
కోహ్లీ ఆగ్రహానికి గురైన అభిమాని.. వీడియో వైరల్..!
Advertisement