Home » ఇండియా , పాకిస్థాన్ క్రికెట్ లో ఉన్న తేడా ఏంటో చెప్పిన ప్లేయర్…!

ఇండియా , పాకిస్థాన్ క్రికెట్ లో ఉన్న తేడా ఏంటో చెప్పిన ప్లేయర్…!

by Azhar
Ad
క్రికెట్ అనేది ప్రపంచంలోనే అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న క్రీడలో ఒక్కటి. ఈ ఆటను చాలా దేశాలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటాయి. అందులో ఇండియా కూడా ఉంటుంది. అలాగే మన దాయాది దేశం పాకిస్థాన్ కూడా క్రికెట్ కు ముఖ్య పాత్రను ఇస్తుంది. ఇక ఏ ఈరెండు దేశాలు ఎదురుపడితే మాత్రం.. అభిమానులకు పండగే అని చెప్పాలి. కానీ ఈ రెండు దేశాల క్రికెట్ బోర్డులో.. అలాగే ఆటగాళ్లలో చాలా తేడాలు అనేవి ఉన్నాయి. అవేంటో పాక్ మాజీ ఆటగాడు అహ్మద్ షెహజాద్ తెలిపాడు.
తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అహ్మద్ షెహజాద్.. ఇండియా, పాకిస్థాన్ రెండు దేశాల్లో కూడా మంచి క్రికెటర్లు ఉన్నారు. అయిన కూడా పాకిస్థాన్ వెనకబడి ఉంది. అందుకు ముఖ్య కారణం భరోసా..! అవును ఇండియాలో ఏ ఆటగాడు అయిన విఫలమవుతుంటే అక్కడ వారికీ భరోనా అనేది లభిస్తుంది. దాంతో వారు చెలరేగిపోతాడు. అందుకు అద్భుతమైన ఉదాహరణ విరాట్ కోహ్లీ. ధోని కోహ్లీకి చాలా మద్దతుగా నిలిచాడు. కోహ్లీ విఫలమైన ప్రతిసారి అతనికి అండగా ఉంటూ.. అవకాశాలు ఇస్తూ వచ్చాడు. అందుకే కోహ్లీ ఇప్పుడు ఈ స్టేజ్ లో ఉండగలిగాడు.
కానీ అదే పాకిస్థాన్ విషయంలో మాత్రం అలా ఉండదు. ఇక్కడ జట్టులోకి కొత్తగా వచ్చిన ఆటగాళ్లకు సీనియర్ల నుండి ఎటువంటి మద్దతు అనేది లభించదు. అలాగే ఈ ఆటగాడు అయిన సరే బాగా రాణిస్తూ.. ఎదుగుతుంటే అతడిని ఎలా కిందికిలాగాలి అనే చూస్తారు. తప్ప.. అతనికి అండగా ఉండాలని ఒక్కరు కూడా అనుకోరు అని అహ్మద్ షెహజాద్ పేర్కొన్నాడు. పాక్ జట్టులో ఒక్కరి సక్సెస్ ను ఇంకొక్కరు తట్టుకోలేరు. ఈ పద్ధతి అనేది మారకపోతే పాకిస్థాన్ జట్టు అనేది ఎప్పటికి బాగుపడదు అని అహ్మద్ షెహజాద్ సూచించాడు.

Advertisement

Visitors Are Also Reading