Home » భువీ వైఫల్యానికి కారణం ఏంటో తెలుసా..?

భువీ వైఫల్యానికి కారణం ఏంటో తెలుసా..?

by Azhar
Ad
భారత జట్టులో కీలక బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ ఒక్కడు. క్రికెట్ ప్రపంచంలో స్వింగ్ కింగ్ గా పేరు అనేది సాధించిన భువనేశ్వర్ కుమార్.. భారత జట్టుకు అన్ని ఫార్మట్స్ లో ఆడగల ఆటగాడు. కానీ ఎక్కువ గాయాల బారిన పడుతుండటంతో భువనేశ్వర్ కుమార్ ప్రస్తుతం టీ20 ల్లో మాత్రం ఆడుతున్నాడు. గాయాల నుండి కోలుకొని… ఈ ఏడాది ఐపీఎల్ ల్లో ఎంటరు ఇచ్చిన భువీ… అద్భుతంగా రాణిస్తున్నాడు.
ఇక ఐపీఎల్ ప్రదర్శనతో భారత జట్టులోకి వచ్చిన భువీ.. ఈ ఏడాది జరిగిన ఆసియా కప్ వరకు అద్భుత ప్రదర్శన అనేది చేసాడు. కానీ ఆసియా కప్ నుండి భువీ డెత్ ఓవర్లలో విఫలం అవుతున్నాడు. అధికంగా పరుగులు అనేవి ఇస్తున్నాడు. ఆసియా కప్ ఓటమిలో ఓరకంగా భువీనే ప్రధానం కారణం. అలాగే తాజాగా ముగిసిన ఆస్ట్రేలియా సిరీస్ లో కూడా భువనేశ్వర్ కుమార్ ఈ విధంగానే విఫలం అయ్యాడు.
అయితే తాజాగా భువీ వైఫల్యానికి కారణం భారత మాజీ ఆటగాడు సంజయ్ మంజ్రేకర్ వివరించాడు. అతను మాట్లాడుతూ.. నేను భువీ చాలా ఏళ్లుగా చూస్తున్నాను. అతను ఇప్పుడు విఫలం కావడానికి కారణం విరామం లేకుండా ఆడటమే. భువీ యొక్క శరీరం అనేది ఎక్కువ పనిని తట్టుకోలేదు. అందుకే అతను కేవలం ఒక్కే ఫార్మాట్ లో ఆడుతున్నాడు. భువీ వైరం తర్వాత వచ్చిన ప్రతిసారి బాగా ఆడి.. తర్వాత విఫలం అవుతాడు అని సంజయ్ పేర్కొన్నాడు.

Advertisement

Visitors Are Also Reading