Telugu News » Blog » నా తప్పే అని ఒప్పుకున్న ఇంగ్లాండ్ బ్యాటర్..!

నా తప్పే అని ఒప్పుకున్న ఇంగ్లాండ్ బ్యాటర్..!

by Manohar Reddy Mano
Ads
ఇంగ్లాండ్, ఇండియా మహిళల జట్ల మధ్య జరిగిన వన్డే సిరీస్ పైన ఇంకా చర్చ జరుగుతూనే ఉంది. ఈ సిరీస్ లోని ఆఖరి మ్యాచ్ లో ఇంగ్లాండ్ యొక్క ఆఖరి బ్యాటర్ చార్లీ డీన్ ను భారత ఆల్ రౌండర్ దీప్తి శర్మ రన్ చేసిన విషయం తెలిసిందే. బల్ వేయకముందే చార్లీ డీన్ క్రీజు దాటడంతో ఆమెను ఔట్ చేసింది దీప్తి. అయితే ఈ రన్ ఔట్ పై గత మూడు రోజులుగా చర్చ అనేది జరుగుతూనే ఉంది.
అయితే ఈ చర్చలో ఇంగ్లాండ్ కు చెందిన వారు.. ఇండియా చేసింది తప్పు.. ఇది క్రీడా స్ఫూర్తికి విరుద్ధం అని కామెంట్స్ చేసారు. కానీ ఇండియాకు చెందిన వారు మేము ఐసీసీ రూల్స్ ప్రకారమే చేసాము అని అంటున్నారు. అయితే ఈ విషయంలో నిన్న సప్నధించిన దీప్తి శర్మ.. మేము చార్లీ డీన్ ను అంతకముందే రెండు సార్లు హెచ్చరించాం.. అయిన ఆమె వినలేదు అందుకే ఔట్ చేసాము అని చెప్పింది.
ఇక తాజాగా ఈ విషయంపై స్వయంగా చార్లీ డీన్ స్పందిస్తూ.. తన తప్పే అని ఒప్పుకుంది. తన సోషల్ మీడియా వేదికగా.. నేను లార్డ్స్ లో ఇంగ్లాండ్ కు ప్రాతినిధ్యం వచించడం చాలా సంతోషంగా ఉంది. అయితే తర్వాతి మ్యాచ్ నుండి నేను క్రీజులో నుండి ముందే బయటకు రాకుండా ఉంటాను అని పీస్ చేసింది చార్లీ డీన్.