Home » తన భర్త కెప్టెన్ తేలిగ్గా కాలేదు అంటున్న సంజనా..!

తన భర్త కెప్టెన్ తేలిగ్గా కాలేదు అంటున్న సంజనా..!

by Azhar
Ad
టీం ఇండియా ప్రస్తుతం ఇంగ్లాండ్ తో రీషెడ్యుల్డ్ టెస్ట్ మ్యాచ్ అనేది ఆడుతున్న విషయం అందరికి తెలిసిందే. ఇక ఈ టెస్ట్ కు భారత పేసర్ బుమ్రా కెప్టెన్సీ వహిస్తున్నాడు. దాంతో టీం ఇండియాకు కెప్టెన్సీ వచ్చిన మొదటి పేసర్ గా బుమ్రా నిలిచాడు. గతంలో కపిల్ దేవ్ కెప్టెన్సీ చేసాడు. కానీ ఆయన ఆల్ రౌండర్ జాబితాలో ఉంటాడు. కాబట్టి మొదట బౌలర్ బుమ్రానే. ఇక బుమ్రా ఈరోజు కెప్టెన్ కావడం పై చాలా మంది ప్రశంసలు అనేవి కురిపిస్తున్నారు. కానీ తన భర్త కెప్టెన్ తేలిగ్గా కాలేదు అని కామెంట్స్ చేస్తుంది బుమ్రా భార్య సంజనా గణేషన్.
బుమ్రా కెప్టెన్ కావడం పై సంజనా మాట్లాడుతూ… భూమా అంత తేలిగ్గా కెప్టెన్ కాలేదు. ముందుగా రోహిత్ నే కెప్టెన్ గా ఉంచాలని సెలక్టర్లు చాలా ప్రయత్నించారు. కానీ అది కుదరలేదు. అందువల్ల అతని తర్వాత ఎవరు జట్టును నడిపించగలరు. ఒకవేళ బుమ్రాను కెప్టెన్ చేస్తే.. ఆ బాధ్యతలను సరిగ్గా నిర్వర్తించగలడా అనే విషయాన్ని అన్ని కోణాల్లో పరిశీలించిన తర్వాతే.. సుదీర్ఘ చర్చల అనంతరం బుమ్రాకు ఈ కెప్టెన్సీ అనేది ఇచ్చారు. అయితే కెప్టెన్సీ తనకు వచ్చిన విషయాన్ని అర్ధం చేసుకోవడానికి బుమ్రాకు సమయం పట్టింది. కానీ ఇప్పుడు అతను చాలా సంతోషంగా.. గర్వంగా ఉన్నాడు అని సంజనా పేర్కొంది.
అదే విధంగా బుమ్రాకు టీం ఇండియా కెప్టెన్సీ ఇచ్చిన విషాయం తెలిసిన తర్వాత.. తన అత్తయ్య.. అంటే బుమ్రా వాళ్ళ అమ్మ చాలా సంతోషించారు అని చెప్పింది. ఆమెకు పెద్దగా క్రికెట్ గురించి తెలియదు. కానీ చిన్నపుడు క్రికెట్ ఆడటానికి వెళ్ళినప్పుడు అక్కడ ఎలా ఉండాలో.. ఎలా ప్రవర్తించాలో అన్ని ఆవిడే బుమ్రాకు చెప్పేది. ఆవిడ బుమ్రా కష్టాన్ని అందరికంటే చాలా దగ్గర నుండి చుసిన మనిషి అని సంజనా తెలిపింది. అయితే ఈ టెస్ట్ మ్యాచ్ కు ముందు కెప్టెన్ రోహిత్ కు కరోనా రావడం.. వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ గాయం కారణంగా అందుబాటులో లేకపోవడంతో బుమ్రాకు ఆ అవకాశం వచ్చింది.

Advertisement

Visitors Are Also Reading