టాలీవుడ్ లో చాలా మంది హీరోయిన్ లు ఉన్నారు. కానీ అందుతో కొంత మంది ఇండస్ట్రీకి ఇప్పుడు దూరంగా ఉన్నారు. అలాంటి వారిలో స్టార్ హీరోయిన్ సంఘవి ఒకరు. ఒకప్పటి స్టార్ హీరోయిన్ సంఘవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. రెండు దశాబ్దాలుగా దక్షిణాది భాషలతో పాటు హిందీలో కూడా 100 చిత్రాల్లో నటించారు. తాజ్ మహల్ సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి పరిచయమైన సంఘవి ఆమె నటనతో, అందంతో, అమాయకత్వంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని కుర్ర కారు అంతా ఫిదా అయిపోయారు.
Advertisement
కర్ణాటకలోని మైసూర్ కు చెందిన ఈ ముద్దుగుమ్మ 1993-2004 మధ్యకాలంలో దక్షిణాది స్టార్ హీరోయిన్ గా చలామణి అయింది. స్టార్ హీరోలు అందరి సరసన నటించి మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంది. 1997లో కృష్ణవంశీ దర్శకత్వంలో చేసినటువంటి సింధూరం సినిమాకుగాను సంఘవి నంది అవార్డును కూడా అందుకున్నారు. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో నటించి ప్రేక్షకులను అలరించింది.
Advertisement
ఈ భామ చాలా ఆలస్యంగా వివాహం చేసుకుంది. 2016లో వెంకటేష్ అనే ఐటీ ఉద్యోగితో కలిసి పెళ్లి పీటలు ఎక్కారు. ఓ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఇటీవలే తిరుపతికి వచ్చిన ఈ జంట మీడియా కంట పడ్డారు. కాసేపు ముచ్చటించిన తర్వాత మళ్లీ సినిమాల్లోకి ఎంట్రీ ఎప్పుడు ఇస్తారు అని అడగ్గా… నా కూతురు చాలా చిన్నది తనకి ఐదు సంవత్సరాలు వచ్చిన తర్వాత ఏదైనా ఆలోచిస్తాను. అప్పటివరకు కొన్ని షోస్ లో మాత్రమే పాల్గొంటానని చెప్పింది.
మరి కొన్ని ముఖ్యమైన వార్తలు:
టీవీ సీరియల్స్ హీరోయిన్స్ ఎంత చదువుకున్నారో తెలుసా…?
Varun Tej – Lavanya : వరుణ్- లావణ్య త్రిపాఠి ఎంగేజ్మెంట్ డేట్ ఫిక్స్ !
భోజనం చేసిన తర్వాత… ఈ తప్పులు చేయకండి!