బ్యూటీ సంయుక్త మీనన్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే టాలెంట్ తో పాటు గంపేడు అదృష్టం కూడా ఉండాలని పలువురు చెబుతుంటారు. అదృష్టం లేకపోతే అవకాశాలు సైతం గుమ్మం దగ్గరకి వచ్చి వెనక్కి వెళ్ళిపోతాయట. కాగా, కొందరి విషయంలో ఎంత కష్టపడ్డా అవకాశాలు మాత్రం అంతంత మాత్రంగానే ఉంటాయి.
Read Also : ఇదేందయ్యా ఇది… 65 ఏళ్ల వయసులో 16 ఏళ్ల అమ్మాయితో మేయర్ పెళ్లి
Advertisement
కానీ కొందరి విషయంలో మాత్రం నక్క తోక తొక్కినట్టు అవకాశాలు బారులు తీస్తుంటాయి. అలా అదృష్టాన్ని అరచేతిలో పట్టుకొచ్చుకున్న బ్యూటీ సంయుక్త మీనన్. గతేడాది రిలీజ్ అయిన భీమ్లా నాయక్ తో తెలుగు తెరకు పరిచయమైంది ఈ కేరళ కుట్టి. బింబిసారా, సార్ చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ను ఖాతాలో వేసుకుని టాలీవుడ్ లో విజయ పరంపర కొనసాగిస్తున్న మలయాళ ముద్దుగుమ్మ సంయుక్త మీనన్. రీసెంట్గా విరూపాక్ష మూవీతో ప్రేక్షకులను పలకరించింది. అయితే సంయుక్త మీనన్ సీక్రెట్ ప్లేస్ లో టాటూ వేయించుకుంది.
Advertisement
READ ALSO : వాహనాల కింద “నిమ్మకాయలను” పెట్టి ఎందుకు తొక్కిస్తారు…?
అది కాస్త ఇప్పుడు ట్రెండ్ అవుతుంది. సంయుక్త తన వీపుపై పచ్చబొట్టు వేయించుకుంది. మలయాళంలో రాయించిన ఆ అక్షరాలకు అర్థం ఏంటో తెలుసుకునేందుకు నెటిజన్లు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. ఎట్టకేలకు ఆ అక్షరాలకు అర్థం తెలిసింది. సంచారి అని మలయాళీ పదం. దానికి తెలుగులో బాటసారి, ప్రయాణికులు అని అర్థాలు వస్తాయి. నిజానికి అసంతృప్తిగా ఉన్నప్పుడు సంయుక్తకి ఒంటరిగా ప్రయాణాలు చేయడం బాగా అలవాటు అట. ఈ విషయం ప్రతిబింబించేలా ఆ టాటూ వేసుకుందట.
READ ALSO : Balagam : తెలంగాణ కానిస్టేబుల్ పరీక్షలో ‘బలగం’ సినిమాపై ప్రశ్న…