Telugu News » మాట‌నిల‌బెట్టుకోని త్రివిక్ర‌మ్….వార్నింగ్ ఇచ్చిన మిర్చి విల‌న్…!

మాట‌నిల‌బెట్టుకోని త్రివిక్ర‌మ్….వార్నింగ్ ఇచ్చిన మిర్చి విల‌న్…!

by AJAY MADDIBOINA

టాలీవుడ్ లో విలన్ గా గుర్తింపు తెచ్చుకున్న నటుడు సంపత్ రాజ్. మిర్చి సినిమాలో ప్రభాస్ కు విలన్ గా నటించి సంపత్ రాజ్ తన నటనతో ప్రేక్షకులను ఫిదా చేశారు. ఇక ఈ సినిమా తర్వాత సంప‌త్ రాజ్ వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. తెలుగుతో పాటు తమిళ మలయాళ భాషల్లోనూ ఆయ‌న‌ సినిమాలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో సంపత్ రాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టాలీవుడ్ లో తన అభిమాన దర్శకుల్లో త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ఒక‌ర‌ని చెప్పారు. త్రివిక్రమ్ దర్శకత్వం అంటే తనకు చాలా ఇష్టమని సంపత్ రాజ్ తెలిపారు.

Ads

sampathraj trivikram

త్రివిక్రమ్ సినిమాలో నటించాలని కోరిక ఉండేదని అన్నారు. ఓసారి త్రివిక్రమ్ సినిమాలో ఒక చిన్న రోల్ ఇచ్చారని చెప్పారు. తన పాత్ర ఏంటో కూడా అడగకుండా చేశానని అన్నారు. త్రివిక్రమ్ మరోసారి పెద్ద రోల్ ఇస్తామని చెప్పారని… ఆ తర్వాత త్రివిక్రమ్ చాలా సినిమాలను తీశారు కానీ తనకు మాత్రం అవకాశం ఇవ్వలేదని అన్నారు. ఈ సారి మాత్రం తనను తీసుకోకుండా సినిమా తీయడానికి ప్రయత్నిస్తే లొకేషన్ కి వెళ్లి కెమెరాను ఎత్తుకువెళ్ళిపోతాను అని త్రివిక్రమ్ కు వార్నింగ్ ఇచ్చానని సంపత్ రాజ్ సరదాగా చెప్పుకొచ్చారు.


You may also like