Home » “సమరసింహారెడ్డి” సినిమాలో నటించిన ఈ అమ్మాయి రామ్ చరణ్ కి ఏమవుతుందో తెలుసా..?

“సమరసింహారెడ్డి” సినిమాలో నటించిన ఈ అమ్మాయి రామ్ చరణ్ కి ఏమవుతుందో తెలుసా..?

by Sravan Sunku
Ad

నటసింహ నందమూరి బాలకృష్ణ కెరీర్ లో ఎన్నో సూపర్ డూపర్ హిట్ చిత్రాలు ఉన్నాయి. అందులో ముందుగా గుర్తొచ్చేది సమరసింహారెడ్డి. అప్పట్లో ఈ సినిమా సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్స్ ట్రెండ్ కి తెరలేపిన చిత్రం కూడా ఇదే కావడం విశేషం. రికార్డ్స్ బ్రేక్ చేసి ఈ మూవీ కాసుల వర్షం కురిపించింది. బి.గోపాల్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం బాలకృష్ణకు మాస్ ఆడియన్స్ లో విపరీతమైన క్రేజ్ ని తీసుకువచ్చింది. ఈ చిత్రంలో సిమ్రాన్, అంజలా జవేరి హీరోయిన్స్ గా నటించారు.

Advertisement

 

అలాగే ఈ చిత్రానికి విజయేంద్ర ప్రసాద్ కథని అందించగా.. మణిశర్మ అదిరిపోయే సంగీతాన్ని సమకూర్చారు. ఈ చిత్రంలో తన చెల్లెళ్ల కోసం బాలయ్య పడే తపన ప్రతి ఒక్కరికి కంటనీరు తెప్పిస్తోంది. ఇక చెల్లెళ్లలో ముఖ్యంగా సరస్వతి గురించి అందరికీ తెలిసే ఉంటుంది.

ఈ చిత్రంలో బాలయ్య చిన్న చెల్లెలిగా ఫిజికల్లీ హ్యాండ్ క్యాప్డ్ పాత్రలో నటించిన అమ్మాయి పేరు సహస్ర. ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరిపోయింది సహస్ర. అయితే ఈ సినిమా కంటే ముందే ఎన్నో వందలాది చిత్రాలలో నటించింది సహస్ర. చిన్న వయసులోనే సినిమాలలోకి అడుగుపెట్టిన ఈ అమ్మాయి చదువును నిర్లక్ష్యం చేయకూడదనే ఉద్దేశంతో సినిమాలకు గుడ్ బై చెప్పేసి ఉన్నత చదువులకు వెళ్లిపోయింది.

Advertisement

సమరసింహారెడ్డినే సహస్ర నటించిన ఆఖరి సినిమా కావడం గమనార్హం. ప్రస్తుతం ఈ అమ్మాయి బిజినెస్ లో రాణిస్తోంది. తాజాగా సహస్ర ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చాలా ఆసక్తికర విషయాలను వెల్లడించింది. వాటిలో ఒకటి మెగా ఫ్యామిలీతో పాటు రామ్ చరణ్ తో తనకి ఉన్న అనుబంధం.

ఈ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. ” చిన్నప్పుడు నేను చాలా ముద్దుగా ఉండడంతో అందరూ నన్ను ఎంతో బాగా చూసుకునేవారు. చిరంజీవి గారితో రౌడీ అల్లుడు అనే సినిమాలో నటించాను. ఆ సినిమా షూటింగ్ సమయంలో చిరంజీవి గారు నన్ను ఆయన ఇంటికి తీసుకువెళ్లారు. అక్కడ రామ్ చరణ్ కి ఎంతో ఇష్టమైన టెడ్డీబేర్ కనిపించడంతో రోజు దాంతో ఆడుకుంటూ ఉండే దానిని. చెర్రీ కూడా నాకు చిన్నప్పుడు మంచి స్నేహితుడు. ఇప్పటికీ బెస్ట్ ఫ్రెండే. అప్పుడప్పుడు మాట్లాడుకుంటాము” అని ఈ సందర్భంగా చెప్పుకొచ్చింది సహస్ర.

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

ఆర్ఆర్ఆర్ చిత్రంలోని ఈ సన్నివేశాన్ని గమనించారా..?

సమంతతో ఉన్న రిలేషన్ పై ప్రీతమ్ జుకాల్కర్ ఆసక్తికర కామెంట్స్..!

Visitors Are Also Reading