టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అగ్రహీరోయిన్లలో సమంత ఒకరు. ఈమె ప్రస్తుతం వరుస సినిమాలతో చాలా బిజీగా గడుపుతోంది. సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన శాకుంతలం, యశోద చిత్రాలు పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్నాయి. యశోద చిత్రం నవంబర్ 11న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. శాకుంతలం చిత్రం కూడా త్వరలోనే రాబోతున్నట్టు సమాచారం.
Also Read : ప్రత్యూష మరణం తరవాత ప్రెస్ మీట్ లో ఆమె తల్లిని తిట్టిన మోహన్ బాబు..? అలా ఎందుకు చేశారంటే..!
Advertisement
దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఖుషి చిత్రీకరణలో పాల్గొంటుంది సమంత. ఈ చిత్రంలో హీరోగా విజయ్ దేవరకొండ నటిస్తున్నారు. ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ ఆకట్టుకుంటుంది. ఇటీవల సమంత సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప సినిమాలో స్పెషల్ సాంగ్ తో ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకుంది. దీంతో సమంత తరువాత చిత్రాలకు రెమ్యూనరేషన్ భారీగానే పెంచినట్టు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. సమంత ప్రస్తుతం తాను చేయబోయే సినిమాలకు దాదాపు రూ.3కోట్ల నుంచి 8 కోట్ల వరకు వసూలు చేస్తున్నట్టు సమాచారం.
Advertisement
Also Read : నటి ప్రగతి జీవితంలో ఇంత విషాదం ఉందా..? డబ్బుల్లేక బంగారం తాకట్టుపెట్టి..!
టాలీవుడ్‌లో ఇప్పటివరకు ఒక్కో సినిమాకు సమంత రూ.3కోట్లు తీసుకునేది. ఇప్పుడు బాలీవుడ్ సినిమాలకు దాదాపు రూ.5 నుంచి రూ.8కోట్ల వరకు తీసుకుంటున్నట్టు టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం సామ్ హిందీలో సిటాడెల్ అనే చిత్రంలో యంగ్ హీరో వరుణ్ ధావన్ సరసన నటిస్తోంది. ఈ చిత్రం త్వరలోనే షూటింగ్ ప్రారంభమవ్వనుంది. గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో సైలెంట్ అయినా ఇప్పుడిప్పుడే తిరిగి యాక్టివ్ అవుతోంది. సమంత ట్విట్టర్ వేదికగా ఆమె నటించిన యశోద చిత్రం ట్రైలర్ అప్‌డేట్ ని షేర్ చేసింది. ఇప్పటికే సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళం, కన్నడం, మలయాళం భాషల్లో నవంబర్ 11న విడుదల కాబోతుంది.
Also Read : మహేష్ “ఒక్కడు”లో ధర్మవరపు చెప్పిన “98480329*9” నెంబర్ ఎవరిదంటే..?