Home » హాలీవుడ్ కు స‌మంత‌! సినిమా కూడా ఫిక్సైపోయింది!!

హాలీవుడ్ కు స‌మంత‌! సినిమా కూడా ఫిక్సైపోయింది!!

by Azhar
Ad

టాలీవుడ్‌లో తెలుగు, తమిళ సినిమాల్లో దూసుకుపోతున్న సమంత. ఏ పాత్ర‌లోనైనా స‌రే ప‌ర‌కాయ‌ప్ర‌వేశం చేసేస్త‌ది. ఇక‌ పెళ్లి తర్వాత చాలా సెలెక్టివ్ గా తక్కువ సినిమాలు చేసింది. మ‌రి ఇప్పుడు చైతన్యతో విడాకులు అవ్వడంతో మళ్ళీ పూర్తిగా సినిమాలపై దృష్టి పెట్టింది. ఇప్పటికే ‘శాకుంతలం’ సినిమా షూటింగ్ పూర్తి చేసింది. తమిళ్ లో ఒక చిత్రం షూటింగ్ లో ఉంది. మరో రెండు తమిళ్, తెలుగు చిత్రాలకి సైన్ చేసింది సమంత. అంతే కాక ‘పుష్ప’ సినిమాలో ఐటెం సాంగ్ కూడా చేయబోతుంది. ‘ఫ్యామిలీ మ్యాన్’ సిరీస్ తో సమంత బాలీవుడ్ లో కూడా ఫేమ్ తెచ్చుకుంది. అందరి సౌత్ హీరోయిన్స్ లాగే సమంత కూడా బాలీవుడ్ కి చెక్కేస్తోంది అనుకున్నారు. కానీ సమంత బాలీవుడ్ కాకుండా ఏకంగా హాలీవుడ్ కి ప్లాన్ చేస్తుంది ఈ భామ‌.

Advertisement

సమంత తన మొదటి హాలీవుడ్ సినిమాని అనౌన్స్ చేసింది. దీంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ‘అరెంజ్‌మెంట్స్‌ ఆఫ్ ల‌వ్‌’ అనే పుస్తక కథ ఆధారంగా తెరకెక్కనున్న ఇంగ్లీష్ సినిమాలో సమంత మెయిన్ లీడ్ చేస్తుంది. ఇండియన్‌ రైటర్‌ టైమెరి ఎన్. మురారి ‘అరెంజ్‌మెంట్స్‌ ఆఫ్ ల‌వ్‌’ అనే నవల రాసింది. దీనిని బ్రిటిష్‌-శ్రీలంక నటి నిమ్మి హర్‌స్గామా పబ్లిక్ చేశారు. 2004లో విడుదలైన ఈ నవల అప్పట్లో అత్యధికంగా అమ్ముడైంది. టొరంటో ఫిల్మ్ ఫెస్టివల్‌తో పాటు టొరంటో ఇంటర్నేషనల్ ఫైనాన్సింగ్ ఫోరమ్‌కు కూడా ఈ నవల ఎంపికైంది.

Advertisement

ఈ సినిమా అన్నౌన్స్ తో సమంత రేంజ్ మారిపోయినట్టే అని అభిమానులు అంటున్నారు. హీరోయిన్స్ అంతా బాలీవుడ్ టార్గెట్ పెట్టుకుంటే సమంత ఏకంగా హాలీవుడ్ టార్గెట్ చేసింది. ఇక అక్కినేని ఫ్యామిలీలో మెంబ‌ర్‌గా ఉన్నంత వ‌ర‌కు ఒక‌లా ఉన్న స‌మంత ఇప్పుడు ఫ్రీబ‌ర్డ్ అయిపోయింద‌ని చెప్పాలి. ఇక హాలీవుడ్ సినిమా అంటే ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. కొన్నిఅభ్యంత‌ర‌క‌ర సిన్ల‌ను కూడా చేయ‌డానికి ఒప్పుకున్న‌ట్లే. అంటే దేనికైనా సిద్ధమే అన్న‌ట్లు ఉంటుంది ఈమె పాత్ర‌. బై-సెక్సువల్‌ తమిళ అమ్మాయిగా సమంత కనిపించబోతోందట. అంటే కేవలం పురుషులకు మాత్రమే కాకుండా స్త్రీల ఆకర్షణకు కూడా లోనయ్యే యువతి పాత్ర ఇది. అంతేగాక ఈ సినిమాను అంతర్జాతీయ స్థాయిలో తీస్తున్నారట. తమిళ, హిందీ భాషలతో పాటు ఇంగ్లిష్, ఫ్రెంచ్ లాంటి భాషల్లో కూడా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారట. అంటే దీన్ని బ‌ట్టి స్యామ్ హ‌ద్దులు దాటి ప్ర‌వ‌ర్తిస్తోంద‌ని కొంద‌రు భావిస్తుంటే.. మ‌రికొంద‌రు అన్ని పాత్ర‌లు చేస్తుంద‌ని.. ఒక న‌టిగా అన్నీ చేయాల‌ని కొంద‌రు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఒక స‌మంత విష‌యానికి వ‌స్తే ఎటువంటి అభ్యంత‌ర‌క‌ర సీన్ల‌ను అయినా చెయ్య‌డానికి రెఢీ అన్న‌ట్లు ఉంది. ఎరేంజ్ మెంట్ ఆఫ్ ల‌వ్ కి ఆఆ ఎరేంజ్‌మెంట్లు కూడా ఓకే అనుకుంట మ‌రి.

Visitors Are Also Reading