టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వరుస సినిమాలతో సమంత ఫుల్ బిజీగా ఉంది. పుష్ప సినిమాలో ఐటమ్ సాంగ్ తో పాన్ ఇండియాకు పరిచయమైంది. అదేవిధంగా సమంత నటించిన ఫ్యామిలీ మాన్-2 వెబ్ సిరీస్ కూడా ప్రేక్షకాదరణ పొందింది. దాంతో అటు బాలీవుడ్ లోనూ కోలీవుడ్, టాలీవుడ్ లలోనూ బిజీగా మారిపోయింది. ఈ నేపథ్యంలోనే సమంత విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.
Advertisement
ఈ సినిమాకు శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కాశ్మీర్ లో జరుగుతోంది. ఈ సినిమా ప్రేమకథా చిత్రంగా తెరకెక్కుతోంది. కాగా నిన్న ఈ సినిమా షూటింగ్ సమయంలో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో ఓ సీన్ లో భాగంగా సమంత విజయ్ దేవరకొండ వద్దకు వెళ్లి కూర్చుంటుంది.
Advertisement
నేను వెళ్తున్నాను 10 రోజుల్లో తిరిగి వస్తా…. మా ఇంటికి వచ్చి నువ్వు మాట్లాడడం కాదు నేనే మీ ఇంటికి వచ్చి మీ వాళ్ళను పెళ్లికి ఒప్పిస్తా అంటూ చెబుతుంది. దాంతో అప్పటి వరకు డల్ గా కనిపించిన విజయ్ దేవరకొండ సమంత తో ఏదో చెబుతున్నట్టు చేస్తాడు. దానికి సమంత షూటింగ్ లో ఇలా చేస్తున్నాడు ఏంటి అని ఒక్కసారిగా షాక్ అవుతుంది.
దాంతో విజయ్ దేవరకొండ హ్యాపీ బర్త్డే సమంత అంటూ పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాడు. అయితే ఇదంతా ముందుగానే ప్లాన్ చేసి చేశారు. దర్శకుడు శివ నిర్వాణ దీనికోసం ఒక స్క్రిప్ట్ కూడా రెడీ చేశాడు. సరిగ్గా 12 గంటల సమయంలో సమంతకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడానికి ఇలా సర్ప్రైజ్ ప్లాన్ చేశారు. దీనికి సమంత కూడా షాక్ అయింది. వాళ్ళు ఇచ్చిన సర్పైజ్ చూసి ఆనందంతో ఆనందభాష్పాలు పెట్టుకుంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
Also read :
“ఆచార్య” సినిమా ని ట్రోల్ చేస్తున్న “అల్లు అర్జున్” ఫాన్స్ ఎందుకో తెలుసా ?
“ఆచార్య” సినిమాకు నెగెటివ్ టాక్ రావడం వెనక ఉన్న 5 కారణాలు….!