Home » “ఆచార్య” సినిమాకు నెగెటివ్ టాక్ రావడం వెనక ఉన్న 5 కారణాలు….!

“ఆచార్య” సినిమాకు నెగెటివ్ టాక్ రావడం వెనక ఉన్న 5 కారణాలు….!

by AJAY
Ad

మెగాస్టార్ చిరంజీవి కొరటాల కాంబినేషన్ లో తెరకెక్కిన ఆచార్య సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదట పాన్ ఇండియా వ్యాప్తంగా విడుదల చేస్తామని ప్రకటించిన ఈ సినిమాను చివరికి కేవలం తెలుగులోనే విడుదల చేశారు. ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా ముఖ్యమైన పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. దాదాపు 40 నిమిషాల పాటు చరణ్ రోల్ కనిపిస్తుంది. అయితే ఇద్దరు స్టార్ హీరోలు నటించిన… స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకు నెగిటివ్ టాక్ వస్తోంది. సినిమాలో ప్రేక్షకులను ఇంప్రెస్ చేసే సీన్ ఒకటి కూడా లేకపోవడంతో నిరాశ చెందుతున్నారు.

Advertisement

కేవలం చరణ్, చిరు తప్ప సినిమాలో చూసేందుకు మరో చెప్పుకోదగ్గ విషయం లేదని అంటున్నారు.ఇదిలా ఉంటే కొన్ని కారణాలవల్ల ఆచార్య సినిమాకి నెగిటివ్ టాక్ వస్తుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం… పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన సినిమాలు వరుసగా ఫ్లాప్ అవుతూ వస్తున్నాయి. ప్రభాస్ తో నటించిన రాధే శ్యామ్ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. రీసెంట్ గా విజయ్ బీస్ట్ కూడా ఫ్లాప్ అయ్యింది. ఇక ఇప్పుడు ఆచార్యకు కూడా నెగిటివ్ టాక్ రావడంతో పూజ హెగ్డే పై ట్రోల్స్ చేస్తున్నారు.

Advertisement

అదేవిధంగా రాజమౌళి సినిమా వచ్చిన తర్వాత మళ్లీ టాలీవుడ్ లో హిట్ రావాలంటే చాలా సమయం పడుతుంది. ఆర్ఆర్ఆర్ తర్వాత విడుదల చేసిన సినిమాలన్నీ వరుసగా ఫ్లాప్ అవుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలోనే ఆచార్య కూడా కూడా నెగెటివ్ టాక్ ను సొంతం చేసుకుందని నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ చిరంజీవి ఇద్దరు నటించడంతో హైప్ పెరిగిందని అదే రామ్ చరణ్ స్థానం లో ఎవరైనా చిన్న హీరో ని తీసుకుని ఉంటే సినిమాకు కనీసం యావరేజ్ టాక్ వచ్చేదని కొంతమంది అభిప్రాయపడుతున్నారు.

మరోవైపు కొరటాల కెరీర్ లో ఇప్పటివరకు ఫ్లాప్ లేదనే సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో చిరంజీవి వేలు పెట్టడం వల్ల కొన్ని మార్పులు జరిగాయని దాంతో సినిమాకు నెగిటివ్ టాక్ వస్తోందని ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా ఇటీవల వచ్చిన అఖండ సినిమాతో ఆచార్య ని పోలుస్తున్నారు. ఆ సినిమాకు కాస్త దగ్గరగా ఉందని కూడా జోరుగా ప్రచారం జరుగుతోంది.

Also read :

త్రిష నుండి మహేష్ బాబు వరకు ఆచార్య ను మిస్ చేసుకున్న 5గురు స్టార్స్ ఎవరో తెలుసా..!

ACHARYA MOVIE REVIEW : ఆచార్య రివ్యూ అండ్ రేటింగ్ ..!

Visitors Are Also Reading