Home » “ఖుషి” షూటింగ్ లో ప్రమాదం….ఆస్పత్రిలో చేరిన సమంత, విజయ్ దేవరకొండ…!

“ఖుషి” షూటింగ్ లో ప్రమాదం….ఆస్పత్రిలో చేరిన సమంత, విజయ్ దేవరకొండ…!

by AJAY
Ad

రౌడీ హీరో విజయ్ దేవరకొండ స్టార్ హీరోయిన్ సమంత కలిసి ఖుషి అనే సినిమా లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం కాశ్మీర్ లో జరుగుతోంది. రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాకు శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు.

Advertisement

ఇదిలా ఉండగా ప్రస్తుతం కాశ్మీర్ షెడ్యుల్ లో ఉన్న ఈ సినిమా షూటింగ్ లో ప్రమాదం జరిగినట్టు గా వార్తలు వినిపిస్తున్నాయి. అంతే కాకుండా సమంత, విజయ్ దేవరకొండ స్వల్పంగా గాయపడినట్టు తెలుస్తోంది. షూటింగ్ లో భాగంగా ఓ తాడు పై వాహనం నడిపే సీన్ ను చిత్రీకరిస్తున్నారు ఈ క్రమంలో వాహనం పడిపోవడం తో సమంత, విజయ్ ఇద్దరు గాయపడ్డారని సమాచారం.

Advertisement

దాంతో వెంటనే చిత్ర యూనిట్ స్థానిక ఆస్పత్రికి ఇద్దరినీ తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ప్రథమ చికిత్స తర్వాత వారి ఆరోగ్య పరిస్తితి ఏంటన్నది తెలియలేదు. ఈ ఘటన పై చిత్ర యూనిట్ కూడా అధికారిక ప్రకటన చేయలేదు. మరో వైపు కాశ్మీర్ షెడ్యుల్ తర్వాత షెడ్యుల్ ను హైదరాబాద్ లో ప్లాన్ చేశారు.

Visitors Are Also Reading