Home » SAMANTHA : పాన్ ఇండియానా బొక్కా…వైర‌ల్ అవుతున్న స‌మంత ట్వీట్..!

SAMANTHA : పాన్ ఇండియానా బొక్కా…వైర‌ల్ అవుతున్న స‌మంత ట్వీట్..!

by AJAY
Ad

ప్ర‌స్తుతం తెలుగు సినిమాల‌ను పాన్ ఇండియా సినిమాలు అనే కంటే పాన్ వ‌ర‌ల్డ్ సినిమాలు అంటేనే బాగుంటుందేమో. ఎందుకంటే మ‌న సినిమాలు విదేశాల్లో కూడా స‌త్తా చాటుతున్నాయి. రీసెంట్ గా విడుద‌లైన ఆర్ఆర్ఆర్ సినిమాకు అమెరికాలోనూ భారీగా క‌లెక్ష‌న్స్ వ‌చ్చాయి. ఇత‌ర దేశాల్లోనూ ఈ సినిమా మంచివ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. ఇదిలా ఉండ‌గా అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శ‌క‌త్వంలో వ‌చ్చిన పుష్ప సినిమాకు కూడా మంచి క్రేజ్ వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే.

Samantha

Samantha

ఈ సినిమాలో స‌మంత స్టెప్పులు వేసిన ఊ అంటావా ఊఊ అంటావా పాట కూడా తెగ వైర‌ల్ అయ్యింది. ఈ పాట యూట్యూబ్ ను షేక్ చేసింది. ఈ పాట‌ను తెలుగుతో పాటూ ఇత‌ర భాష‌ల్లోనూ విడుద‌ల చేశారు. అంతే కాకుండా ఈ పాట‌ను ఒక్కో భాష‌లో ఒక్కో సింగ‌ర్ తో పాడించారు. ఇదిలా ఉంటే పుష్ప సినిమాకు పాన్ వ‌ర‌ల్డ్ లో క్రేజ్ వ‌చ్చింద‌ని తాజాగా వైల‌ర్ అవుతున్న ఓ వీడియోతో తెలిసిపోయింది.

Advertisement

Advertisement

ఈ సినిమాలో స‌మంత చేసిన ఊ అంటావా పాటను అమెరికాలోని ఫ్లోరిడాలో అల్ట్రామైమీ పేరుతో ఏర్పాటు చేసిన మ్యూజిక్ ఫెస్టివ‌ల్ లో ప్ర‌ద‌ర్శించారు. ప్ర‌తి యేడాది ఫ్లోరిడాలో అల్ట్రామైమీ పేరుతో మ్యూజిక్ ఫెస్టివ‌ల్ ను ఏర్పాటు చేస్తారు.

samantha

samantha

ఇక ఈ యేడాది ఫెస్టివ‌ల్ లో ఊ అంటావా పాట‌ను ప్ర‌ద‌ర్శించ‌గా దానికి సంబంధించిన వీడియోను ఓ నెటిజ‌న్ షేర్ చేశాడు. ఈ వీడియోకు ఇది పాన్ ఇండియానా బొక్కా …పుష్ప పాన్ వ‌ర‌ల్డ్ అంటూ కామెంట్ పెట్టాడు. ఇక స‌మంత ఈ పోస్ట్ ను చూసి తెగ సంబుర‌ప‌డిపోయింది. అంతే కాకుండా పోస్ట్ ను షేర్ చేసిన స‌మంత ఆశ్చ‌ర్య‌పోయిన‌ట్టు ఎమోజీల‌ను జోడించింది.

Visitors Are Also Reading