టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. తాజాగా కాతువాక్కుల రెండు కాదల్ అనే తమిళ సినిమాలో నటించింది. ఈ సినిమాలో విజయ్ సేతుపతి హీరోగా నటించగా సమంత, లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ లుగా నటించారు. ఈ సినిమా త్వరలోనే విడుదలకు సిద్ధంగా ఉంది. మరో వైపు సమంత బాలీవుడ్ లో ఓ వెబ్ సిరీస్ లో ముఖ్యమైన పాత్రలో నటిస్తోంది. అదే విధంగా తెలుగులో ఇప్పటికే శాకుంతలం అనే సినిమాను సమంత పూర్తి చేసింది.
ఈ సినిమా కూడా రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఇది ఇలా ఉండగానే సమంత విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో ఓ సినిమా అనౌన్స్ చేశారు. ఈ సినిమాకు శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా పూజా కార్యక్రమాలు నిన్న హైదరాబాద్ లో జరిగింది. ఈ చిత్రానికి కుషి అనే టైటిల్ ను ఖరారు చేసారు. సినిమాల విషయం పక్కన పెడితే సమంత గతేడాది నాగచైతన్య తో విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే.
Advertisement
Advertisement
అయితే సమంత నాగచైతన్య విడాకుల తరవాత సమంత పై ట్రోల్స్ పెరిగిపోయాయి. కొందరు పనిగట్టుకుని సమంతపై ట్రోల్స్ చేస్తున్నారు. ఇటీవలి కాలంలో సమంత గ్లామర్ షో చేస్తూ కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫోటోలపై దారుణమైన కామెంట్లు వస్తున్నాయి. దాంతో తాజాగా సమంత స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తు ఓ ట్వీట్ చేసింది.
ట్వీట్ లో….. మంచితనాన్ని చేతగానితనంగా అనుకోవద్దు అంటూ ఫైర్ అయ్యింది. నా మౌనం అంగీకారం కాదు…. ప్రతి విషయానికి హద్దు ఉంటుందని సమంత పేర్కొంది. మంచితనానికి కూడా ఒక హద్దు ఉంటుంది అంటూ సమంత పోస్ట్ లో పేర్కొంది. గతంలో కూడా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ పై సమంత కోర్టులో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.
Also read :
“స్వాతిముత్యం”లో కమల్ హాసన్ భార్య దీప ఇప్పుడు ఎక్కడ ఉందో… ఏం చేస్తుందో తెలుసా..!
మొదటి భార్య అనితతో దిల్ రాజుకు గొడవలు…ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు…!