సమంత.. గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో దశాబ్ద కాలానికి పైగా తిరుగులేని హీరోయిన్ గా కొనసాగుతోంది సమంత. ఏం మాయ చేసావే సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు తాజాగా విడుదలైన యశోద వరకు ఎక్కడ కూడా విరామం తీసుకోలేదు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి తన నటన, టాలెంట్ తో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. అయితే నాగచైతన్యతో విడాకుల తర్వాత మయోసైటిస్ అనే వ్యాధి బారిన పడింది సామ్. దీనిపై ఆమె ఇటీవల ప్రకటించింది.
ఇది ఇలా ఉండగా, మయోసైటిస్ తో పోరాటం చేస్తూ గత కొంతకాలంగా ఇంటికే పరిమితమైన సమంత… తాజాగా ట్విటర్ వేదికగా అభిమానులతో ముచ్చడించారు. ఇందులో భాగంగా ఓ నెటిజన్ “మేడమ్ మీ జీవితం ఎలా సాగుతోంది” అని ప్రశ్నించగా, “విభిన్నంగా ఉంది” అని సామ్ బదులిచ్చారు. అనంతరం మరో నెటిజన్ “మేడం మీ కోసం నేను ప్రార్థిస్తున్నాను. మీరు ఆరోగ్యంగా తిరిగి రావాలని ప్రతి రోజు కోరుకుంటున్నాను. మళ్ళీ మీరు బాక్సాఫీస్ సక్సెస్ లు అందుకోవాలి.
అలాగే విమర్శలను తిరిగి కొట్టాలి” అని కోరగా, “మీ ఆశీస్సులు, ప్రార్థనలు నాకెంతో అవసరం. ఇంతకీ ఏం విమర్శలు” అంటూ సరదాగా బదులిచ్చారు. “మీరు శాకుంతలం ప్రాజెక్టు అంగీకరించడానికి కారణం ఏమిటి?” అని వేరొక నెటిజన్ ప్రశ్నించగా, “త్వరలో మీరే చూస్తారు కదా” అని ఆమె చెప్పారు. తాను ఆరోగ్యంగా ఉండాలని కోరుకున్న ప్రతి ఒక్కరికి ఆమె ధన్యవాదాలు చెప్పారు. కాగా, సమంత నటించిన శాంకుతలం సినిమా ఫిబ్రవరి 17 రిలీజ్ అవుతున్నట్లు తాజాగా చిత్ర బృందం ప్రకటించింది.
READ ALSO : K.G.F లాంటి సినిమా, 30 ఏళ్ల క్రితమే తీసిన మెగాస్టార్ చిరంజీవి