Home » K.G.F లాంటి సినిమా, 30 ఏళ్ల క్రితమే తీసిన మెగాస్టార్ చిరంజీవి

K.G.F లాంటి సినిమా, 30 ఏళ్ల క్రితమే తీసిన మెగాస్టార్ చిరంజీవి

by Bunty
Ad

ఇటీవల కాలంలో వచ్చి బాక్సాఫీస్ ను దున్నేసిన సినిమాల లిస్టులో కేజిఎఫ్ సినిమా కూడా ఒకటి. ఒకప్పుడు కన్నడ సినిమాలకు పెద్దగా మార్కెట్ ఉండకపోయేది.

Advertisement

కానీ కేజీఎఫ్ సినిమా దెబ్బతో అన్ని మారిపోయాయి. కన్నడ సినిమాలకు ఇండియా లెవెల్ లో మార్కెట్ ఏర్పడింది. యష్ హీరోగా, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా రికార్డులు క్రియేట్ చేసింది. బాక్స్ఆఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది.

Also Read:  బాలయ్య, పవన్‌ ఫ్యాన్స్‌ మధ్య ఫైట్..TDP లేకపోతే పవన్ అసెంబ్లీ గేటు కూడా టచ్ చేయలేడంటూ !

ఈ సినిమా కథ, స్క్రీన్ ప్లే, హీరో ఎలివేషన్స్ ఇలా ప్రతి ఒక్కటి తెలుగు ప్రేక్షకులకు తెగ నచ్చేసాయి. అయితే అచ్చం ఇలాంటి సినిమాలోనే మెగాస్టార్ చిరంజీవి 36 ఏళ్ల క్రితమే నటించాడు అన్న సంగతి చాలా మందికి తెలియదు. కొన్ని సినిమాలు చూస్తుంటే ఇలాంటి సినిమాలు ఎక్కడో చూసానే అన్నట్టుగా కొన్ని చిత్రాలు గుర్తుకు వస్తాయి. అలానే కేజిఎఫ్ సినిమాలాంటి సినిమా చిరంజీవి కెరీర్ లో ఒకటి ఉంది. ఆ సినిమా మరి ఏదో కాదు రాక్షసుడు సినిమా. కేజీఎఫ్ సినిమాలో యష్ కు తల్లి మాత్రమే ఉంటుంది.

Advertisement

 

అదే విధంగా రాక్షసుడు సినిమాలో కూడా వితంతు మహిళ బిడ్డకు జన్మనిస్తుంది. ఆ ఊరి పెద్ద దానిని ఆమోదించక బిడ్డను పారేయగా ఓ తాగుబోతు చేతికి దొరుకుతాడు. ఆ తాగుబోతు అబ్బాయిని పెంచి లేబర్ క్యాంప్ కు విక్రయించాలని చూస్తాడు. కానీ అతడు తన తల్లిని వెతుక్కునేందుకు వెళతాడు. అక్కడ యజమాని మీ తల్లి పారిపోయిందని దానికి తనకు డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తాడు. కాగా హీరో ఎలా ప్రతీకారం తీర్చుకుంటాడు. తన తల్లిని ఎలా చేరుతాడు అన్నదే సినిమా కథ. అయితే సినిమా కథ అటు ఇటుగా ఉన్న టేకింగ్ మాత్రం కేజిఎఫ్ మాదిరిగానే ఉంటుంది. ఈ సినిమా అప్పట్లో మంచి విజయం సాధించింది.

READ ALSO : పొరపాటున కూడా ఈ వస్తువులు రైల్లో తీసుకువెళ్ళకూడదు.. పట్టుబడ్డారో జరిమానాతో పాటు జైలుకు వెళ్లాల్సిందే..!

 

Visitors Are Also Reading