టాలీవుడ్ స్టార్స్ సమంత, నాగచైతన్య విడాకులు ప్రకటించిన తరువాత కూడా వారు బిజీ అయ్యారు. ఈ సమయంలో వారిద్దరూ మరొక పెళ్లి చేసుకుంటారా లేదా అనే చర్చ కొనసాగుతుంది. వీరిద్దరూ కూడా సినిమాలు వెబ్ సిరీస్ అంటూ బిజీ బిజీగా గడుపుతున్నారు. ఈ తరుణంలో ఇప్పట్లో వీరు పెళ్లి చేసుకునే ఆలోచన లేదని క్లారిటీ వచ్చేసింది. ఇటీవలే సమంత ఆమె పెళ్లికి సంబంధించిన చీర, పలు వస్తువులను కూడా పంపించినట్టు సమాచారం. సమంతకు పెళ్లి చేసే విషయం గురించి వారి కుటుంబ సభ్యుల్లో చర్చ జరుగుతుందని తమిళ మీడియా కోడైకూస్తుంది.
ఈ విషయం పై ఆమెకు అత్యంత సన్నిహితురాలు అయిన స్నేహితురాలిని అడగ్గానే సమంత ప్రస్తుతానికి జీవితాన్ని ఆస్వాదిస్తూ ఉంది. ఆమె కొత్త జీవితాన్ని అనుభవించేందుకు సమయం కావాలంటోంది. ప్రస్తుతానికి ఒంటరి జీవితాన్ని గడుపుతూ కొత్త ప్రపంచాన్ని చూస్తా అంటుంది. ఇప్పట్లో పెళ్లి ఆలోచన లేదు. కానీ భవిష్యత్‌లో తన మనస్సుకు నచ్చిన వాడు దొరికితే పెళ్లి చేసుకుంటుందని చెప్పుకొచ్చింది.
Advertisement
Advertisement
సమంత ప్రస్తుతం పెళ్లి ఆలోచన లేదని.. పూర్తిగా కెరీర్ పైనే దృష్టి పెట్టనుందట. తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లో కూడా ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తోంది. ఇలాంటి సమయంలో ఆమె పెళ్లి విషయాన్ని మీడియాలో ప్రచారం చేసి ఆమె కెరీర్‌ను ఇబ్బంది పెట్టే విధంగా కొందరూ ప్రయత్నాలు చేస్తున్నారంటూ అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలే నాగచైతన్యతో విడాకులు ప్రకటించిన సమంత అప్పుడే రెండవ పెళ్లి గురించి ఎలా ఆలోచిస్తుందని కొందరూ కామెంట్స్ చేస్తున్నారు. సమంత మళ్లీ పెళ్లి చేసుకుంటుందా లేదా అనేది తెలియాలంటే మాత్రం కొద్ది రోజుల పాటు వేచి చూడాలి.