టాలీవుడ్ హీరోయిన్ సమంత గురించి తెలియని వారు ఉండరు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో తన అంద చందాలతో, నటన చాతుర్యంతో ఎంతో గుర్తింపును సాధించింది సమంత. ఇప్పటికే ఆమె నటించిన ఎన్నో సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాయి. దాదాపు సౌత్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి అందరూ అగ్ర హీరోలతో ఆమె నటించింది. అలాంటి సమంత ఇప్పటికీ తరగని అందంతో దూసుకుపోతోంది.
Read Also : మరో నాలుగు నెలల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు : CM KCR
Advertisement
సమంత సినిమాలో బిజీగా ఉండడమే కాకుండా సోషల్ మీడియాలో కూడా ఎప్పుడు యాక్టివ్ గా ఉంటుంది. అయితే వరుస సినిమాలతో బిజీగా ఉన్న సమయంలోనే ఆమె మయోసైటిస్ బారిన పడింది. మయోసైటిస్ వ్యాధితో కండరాల నొప్పులు తీవ్రంగా బాధిస్తాయి. శరీరం అంతటా నొప్పులు ఉంటుంటాయి. దీంతో శరీరంలో ఇన్ ఫ్లమ్మేషన్ పోవడానికి ఇన్ఫెక్షన్లు తగ్గడానికి వీలుగా సమంత ప్రస్తుతం హైపర్ బారిక్ అనే ఆక్సిజన్ థెరపీ తీసుకుంటుంది.
Advertisement
READ ALSO : రెచ్చిపోయిన ‘RX 100’ హీరోయిన్ పాయల్ రాజ్ పుత్… ఏకంగా అలా..!
ఈ చికిత్సతో దెబ్బతిన్న కణజాలం తిరిగి కోరుకుంటుంది. నిర్ణీత ప్రెషర్ తో కూడిన స్వచ్ఛమైన ఆక్సిజన్ తీసుకోవడమే హైపర్ బారిక్ చికిత్స. సాధారణ వాయు పీడనంలో మనం తీసుకునే ఆక్సిజన్ తో పోలిస్తే ఈ చికిత్స రూపంలో ఎక్కువ ఆక్సిజన్ ఊపిరితిత్తులకు అందుతుంది. ఇలా ఆదనపు ఆక్సిజన్ అనేది బ్యాక్టీరియాపై పోరాటంలో సహాయపడుతుంది. దీనికి సంబంధించిన ఫోటో వైరల్ గా మారింది. అయితే, ఆక్సిజన్ మాస్క్ తో సమంత…కనిపించడంతో ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.
READ ALSO : కోట్ల ఆస్తులు ఉన్నా.. అమెరికాలో ఆ జాబ్ చేస్తున్న హీరోయిన్ లయ…!