సమంత సినిమాలు ఈ మధ్య ఎక్కువగా రాలేదు అనే విషయం తెలిసిందే. గత ఏడాదే నాగ చైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత.. కొంత గ్యాప్ ఇచ్చి మళ్ళీ సినిమా షూటింగ్స్ అనేవి ప్రారంభించింది. అయితే ప్రస్తుతం సమంత తెలుగులో మూడు సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. అందులో హీరో విజయ్ దేవరకొండతో కలిసి ఖుషి సినిమా చేస్తుంటే.. శాకుంతలం, యశోద అనే లేడి ఓరియెంటెడ్ సినిమాలు చేస్తుంది.
Advertisement
ఇక ఇందులో తాజాగా యశోద సినిమా యొక్క టీజర్ అనేది వచ్చింది. అందులో ప్రెగ్నెంట్ గా కనిపించిన సమంత.. ఓ గర్భవతి స్త్రీ ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోకూడదో మొత్తం అవే పరిస్థితులు ఆమె ఎదుర్కొంటుంది అనేలా చూపించారు. ఇక ఇందులో సమంత నటనకు కూడా మంచి మార్కులు పడ్డాయి. కానీ ఈ సినిమా కోసం ఇప్పుడు సమంత తీసుకున్న రెన్యుమరేషన్ అనేది అందరిని షాక్ కు గురిచేస్తుంది అనే చెప్పాలి.
Advertisement
ఈ యశోద సినిమా కోసం సమంత కేవలం 50 రోజులు మాత్రమే కేటాయించినట్లు తెలుస్తుంది. కానీ ఆ 50 రోజుల కోసమే సమంత ఏకంగా 2.75 కోట్లు వసూల్ చేసినట్లు సమాచారం అందుతుంది. అయితే మొదట ఈ సినిమాను గత నెల 12న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. కానీ అది కుదరలేదు. అలాగే ఇంకా కొత్త రిలీజ్ డేట్ ను కూడా చిత్ర బృందం ఇంకా ప్రకటించలేదు. చూడాలి మరి ఈ యశోద ఎప్పుడు విడుదల అవుతుంది అనేది.
ఇవి కూడా చదవండి :