Home » పుష్ప ఐట‌మ్ సాంగ్ కోసం సమంత భారీ రెమ్యున‌రేష‌న్…ఎంతంటే..?

పుష్ప ఐట‌మ్ సాంగ్ కోసం సమంత భారీ రెమ్యున‌రేష‌న్…ఎంతంటే..?

by AJAY
Ad

టాలీవుడ్ బ్యూటీ స‌మంత జోరు న‌డుస్తోంది. పెళ్లికి మందు..వైవాహిక జీవితంలో ఎక్క‌డా కూడా స‌మంత గ్యాప్ తీసుకోలేదు. వ‌రుస అవకాశాల‌తో దూసుకుపోయింది. ఇక విడాకుల త‌ర‌వాత కూడా స‌మంత అదే హ‌వాను కొనసాగిస్తోంది. అంతే కాకుండా బాలీవుడ్, హాలీవుడ్ ఆఫ‌ర్ల‌ను ద‌క్కించుకుంటోంది. మ‌రోవైపు సామ్ అందాల వ‌డ్డ‌నకు కూడా సిద్ద‌మంటూ చెప్ప‌క‌నే చెబుతోంది. అందుకు నిద‌ర్శ‌న‌మే పుష్ప‌లో ఐట‌మ్ సాంగ్ కు గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌డం. ఇక ఇప్ప‌టికే పుష్ప ఐట‌మ్ సాంగ్ ప్రోమో ఊ అంటావా మామా…ఊఊ అంటావా అంటూ విడుద‌ల‌య్యింది. ఈ పాట‌కు డీఎస్పీ స్వరాలు స‌మ‌కూర్చారు. ఈ పాటను మంగ్లీ సోద‌రి ఇంద్రావ‌తి చౌహాన్ పాడి అల‌రించింది.

Advertisement

Advertisement

ఇక ఈ పాట‌లో సమంత రెచ్చిపోయింది. అయితే సినిమాల‌కు భారీగా రెమ్యన‌రేష‌న్ పుచ్చ‌కునే స‌మంత మొద‌టి సారి స్టెప్పులు వేసిన ఐట‌మ్ సాంగ్ కు ఎంత తీసుకుందా అన్న ఆస‌క్తి సినిమా ల‌వ‌ర్స్ లో నెల‌కొంది. ఈ పాట కోసం స‌మంత ఏకంగా రూ.1.5 కోట్ల రెమ్యున‌రేష‌న్ పుచ్చుకుంద‌ట‌. అంతే కాకుండా ఈ పాట చిత్రీక‌ర‌ణ కోసం కూడా చిత్ర‌యూనిట్ భారీగా ఖర్చు చేసింద‌ట‌. ఏకంగా రూ,5 కోట్లు ఖ‌ర్చు చేసి పాట‌ను చిత్రించార‌ట‌. ఈ పాట కోసం వేసిన సెట్ వ‌ల్లే అంత ఖ‌ర్చు అయ్యింద‌ని స‌మాచారం.

Samantha oo antava సాంగ్

Samantha oo antava song

మ‌రి ఐదు కోట్లు ఖ‌ర్చు చేసి తీసిన ఈ సాంగ్ ఏ రేంజ్ లో ఉందో తెలియాంటే సినిమా చూడాల్సిందే. ఇదిలా ఉండగా ఈ సినిమాలో అల్లు అర్జున్ హీరోగా న‌టించగా సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఇప్ప‌టికే స‌మంత సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన రంగ‌స్థ‌లం సినిమాలో హీరోయిన్ గా న‌టించింది. ఈ సినిమా రికార్డులు క్రియేట్ చేసింది. ఇక ఇప్పుడు సుక్కు ద‌ర్శ‌క‌త్వంలో ఐట‌మ్ సాంగ్ తో ముందుకు వ‌చ్చింది. మ‌రి ఈ సినిమా ఎలాంటి విజ‌యం సాధిస్తుందో చూడాలి.

 

Visitors Are Also Reading