తెలుగు చలనచిత్ర పరిశ్రమతో పాటు తమిళ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నది నటి సమంత. అక్కినేని ఇంట్లో కోడలుగా అడుగుపెట్టి నాలుగేళ్లు తిరగక ముందే ఆ ఇంటి నుండి బయటికి వచ్చి అందరికీ షాక్ ఇచ్చినది ఈ అమ్ముడు. ఎంతో అన్యోన్యంగా ఎందరికో ఆదర్శంగా ఉన్న ఈ జంట ఒక్కసారిగా విడిపోవడం అప్పట్లో అందరినీ కలిచివేసింది. విడాకుల సమయంలో మొదట్లో కొంత మానసికంగా బాధపడినా.. ఆ తరువాత నిత్యం ఎవరికో ఒకరికీ పరోక్షంగా ఏదో ఒక పోస్ట్ పెడుతూ అభిమానులను ఆలోచనలలో పడేస్తోంది.
Advertisement
తన పర్సనల్ లైఫ్ గురించి వస్తున్న రూమర్లకు చెక్ పెడతూనే మరెన్నో అనుమానాలకు తావు ఇస్తోంది. ఇలాగే సమంత తాజాగా పోస్ట్ చేసిన ఓ కొటేషన్ సామాజిక మాధ్యమాలలో బాగా వైరల్ అవుతుంది. విడాకుల అనంతరం సామ్ వరుస చిత్రాలకు సైన్ చేస్తూ తన దూకుడును కొనసాగిస్తోంది. ప్రస్తుతం తన బ్యాచ్‌లర్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తూనే సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది.
Advertisement
తాజాగా తన ఇన్ స్టా ఖాతాలో ఒక కొటేషన్ కూడా షేర్ చేసినది. వారు ఏమనుకుంటున్నా సరే వీరు ఏమి నమ్ముతున్నారు..? అని ఆలోచించాల్సిన పని లేదు స్నేహితులారా.. ఇతరుల అభిప్రాయాలు, వారి ప్రశంసలు మనకు అవసరం లేదు. మీరు స్వేచ్ఛగా ఉంటే.. వారు మిమ్మల్ని ఎప్పటికీ ఏమి చేయలేరు అని అర్థం వచ్చే విధంగా ఓ చేసింది. ఈ పోస్ట్ తన మాజీ మామ నాగార్జున, మాజీ భర్త నాగచైతన్యనుద్దేశించి అన్నదే అని నెటిజన్లు భావిస్తున్నారు. మరోవైపు అక్కినేని అభిమానులు విడాకుల తరువాత కూడా సమంత నాగచైతన్యను వదలడం లేదు అని మండి పడుతున్నారు. నూతన సంవత్సరం రోజు సమంత చేసిన పోస్ట్ నెట్టింట్లో వైరల్ అవుతుంది.