టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. కేవలం టాలీవుడ్ లోనే కాకుండా తమిళ, హిందీ భాషల్లోనూ ఆఫర్ లను అందుకుంటోంది. అంతే కాకుండా వెబ్ సిరీస్ లలోనూ నటిస్తూ ఓటీటీ ప్రేక్షకులను సైతం అలరిస్తోంది. సమంత నటించిన ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్ ఇండియాలోనే బెస్ట్ వెబ్ సిరీస్ గా నిలిచింది. సమంత ఏమ్మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయిన సంగతి తెలిసిందే.
ALSO READ :మొదటిసారి కాబోయే భార్య ఫోటోను షేర్ చేసిన మనోజ్…నెట్టింట వైరల్..!
Advertisement
ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడంతో సమంతకు ఆఫర్ లు క్యూ కట్టాయి. అలా స్టార్ హీరోల సినిమాలలో ఆఫర్ లను అందుకుంది. మహేశ్ బాబు, రామ్ చరణ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్, పవన్ కల్యాణ్ ఇలా స్టార్ హీరోలు అందరితోనూ సమంత సినిమాలు చేసింది. ఇక సమంత 2017లో నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.
Advertisement
అయితే ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో గతేడాది డిసెంబర్ లో విడాకులు తీసుకుంది. విడాకుల తరవాత సమంతకు ఆఫర్ లు తగ్గుతాయని అంతా అనుకున్నారు. కానీ విడాకుల తరవాతనే సమంత ఫుల్ బిజీగా మారిపోయింది. పుష్ఫ సినిమాలో ఊ అంటావా అంటూ ఐటమ్ సాంగ్ లో స్టెప్పులు వేసి పాన్ ఇండియా లెవల్ లో అభిమానులను సంపాదించుకుంది. ఈ పాట యూట్యూబ్ ను షేక్ చేసింది.
ఇదిలా ఉంటే సమంత కేవలం సినిమాలు ద్వారానే కాకుండా వ్యాపారప్రకటనల ద్వారా కూడా ఫుల్ గా సంపాదిస్తున్నట్టు తెలుస్తోంది. సమంతకు సోషల్ మీడియాలో మిలియన్స్ కొద్దీ ఫాలోవర్స్ ఉన్న సంగతి తెలిసిందే. దాంతో సమంత ఇన్స్టాగ్రామ్ లో ఒక్కో పోస్ట్ క ఏకంగా రూ.20లక్షల వరకూ తీసుకుంటుందట. అంతే కాకుండా మొత్తంగా చూసుకుంటే సమంత నెలకు ఇన్స్టాగ్రామ్ ద్వారానే రూ.3 కోట్ల వరకూ పుచ్చుకుంటుందట. సమంత మాత్రమే కాకుండా ఇప్పుడు చాలా మంది హీరోయిన్ లు ఇలా సంపాదిస్తున్నారు.
ALSO READ :ముత్యాల్లాంటి NTR చేతిరాత…ప్రింట్ కాదండోయ్!